AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరే కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడం ఇంత సింపులా.. ఈ సీక్రెట్ ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం

Onion Cutting Hack Without Tears: ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కళ్లు మంట పుట్టడం, నీళ్లు కారడం అందరికీ ఎదురయ్యే సాధారణ సమస్యే. ఉల్లిపాయను కోసినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ సమ్మేళనాలు గాలి ద్వారా కళ్లలోని తేమతో కలవడం వల్ల మనకు కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. అయితే కోసే విధానంలో కొన్ని చిట్కాలు తెలుసుకుంటే మీరు కళ్ల నుంచి నీళ్లు రాకుండానే ఉల్లిపాయలు కట్ చేయవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Nov 25, 2026 | 7:59 PM

Share
వేరు భాగం చివరి వరకు : చాలా మంది ఉల్లిపాయను కట్ చేసే టప్పడు చాలా మంది కొన్ని చిన్న తప్పులు చేస్తారు. ఉల్లిపాయలో వేరు ఉండే భాగంలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఉల్లిపాయను రెండు ముక్కలుగా కోసినప్పుడు వేరు భాగాన్ని తొలగించకుండా అలాగే ఉంచి, పైభాగం నుంచి తరగడం ప్రారంభించడం మంచిది. ఇలా చేస్తే కళ్లలో మంట ఏర్పడటాన్ని చాలావరకు తగ్గించవచ్చు.

1 / 5
వేరు భాగాన్ని పట్టుకుని: మీరు సగానికి కోసిన ఉల్లిపాయ వేరు భాగాన్ని వేళ్లతో పట్టుకుని, వేరు వరకు పూర్తిగా కోయకుండా తరిగినప్పుడు సల్ఫర్ బయటకు వ్యాపించడం తగ్గుతుంది. చివరగా వేరు ఉన్న చిన్న భాగాన్ని మాత్రమే వేరు చేసి తరుగుకోవచ్చు. ఉల్లిపాయ అంచులను సరిగ్గా పట్టుకుని తరగడం వల్ల ముక్కలు ఒకే పరిమాణంలో వేగంగా వస్తాయి.

2 / 5
ఉల్లిపాయలు తరగడాని మనం ఏ కత్తి వాడుతున్నామనేది కూడా ముఖ్యం. పదును తగ్గిన కత్తిని ఉపయోగిస్తే ఉల్లిపాయ కణాలు ఎక్కువగా నలిగిపోయి రసం ఎక్కువగా బయటకు వస్తుంది. కాబట్టి మంచి పదును ఉన్న కత్తిని వాడడం మంచిది.

3 / 5
అయితే మీకు కళ్లలో నీళ్లు రాకుండా ఉండాలంటే కోసే ముందు ఉల్లిపాయలను నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల రసం గాలిలో వ్యాపించే వేగం తగ్గుతుంది. దీనివల్ల కళ్ల మంటను నివారించవచ్చు.

4 / 5
అలాగే ఉల్లిపాయలు కోటేటప్పుడు వంటగదిలో ఫ్యాన్ లేదా ఎగ్జాస్ట్ ఆన్ చేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ నుంచి వచ్చే రసం కళ్ల వైపు కాకుండా పక్కకు వెళ్తుంది. ఈ చిట్కాలను పాటిస్తూ ఉల్లిపాయ తరిగితే కన్నీళ్లు రాకుండా ఉండటమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి ఈ సారి ఉల్లిపాయలు కోసేటప్పుడు ఈ పద్ధతులను తప్పకుండా ప్రయత్నించి చూడండి.

5 / 5
Follow Us
తెల్ల జుట్టుకు హెన్నా పెట్టడం మానలేకపోతున్నారా?.. ఇది తెలుసుకోండి

అరెరే కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడం ఇంత సింపులా

ఓటీటీలో దుమ్మురేపుతున్న 8 ఎపిసోడ్స్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న 8 ఎపిసోడ్స్..
భారత్‌లో మారుతున్న యువత ఆలోచనలు.. ఉద్యోగం కంటే సొంత బిజినెస్‌పైనే

పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు

తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్

చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  

పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?

ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!