ఇలా స్టోర్ చేస్తే ఉల్లిపాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి

25 November 2026

Anand T

ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిని సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

 పెరిగిన ధరలు

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఉల్లిపాయలను నెలల పాటు తాజాగా ఉంచుకోవచ్చు.

 తాజా చిట్కా

ఉల్లిపాయలు ఫ్రెష్‌గా ఉండాలంటే వాటిని ఎప్పుడూ గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచాలి. మూత ఉన్న డబ్బాల్లో అస్సలు పెట్టకూడదు.

గాలి తగిలేలా

ఉల్లిపాయలకు సరైన గాలి ప్రసరణ లేకపోతే తేమ పేరుకుపోయి త్వరగా కుళ్లిపోయే ప్రమాదం ఉంది.

తేమ

ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఎప్పుడూ ఒకే చోట ఉంచవద్దు. ఆలూ నుంచి విడుదలయ్యే వాయువుల వల్ల ఉల్లిపాయలు త్వరగా పాడవుతాయి.

అలూతో వద్దు

ఉల్లిపాయలను ఒక వెడల్పాటి కబోర్డు లేదా షెల్ఫ్‌లో న్యూస్ పేపర్ పరిచి, దానిపై ఉల్లిపాయలను వేసి నిల్వ చేయండి.

ఇలా స్టోర్ చేయండి

తొక్క తీయని, పూర్తి ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టరాదు. ఫ్రిజ్‌లోని చల్లదనం కారణంగా వాటిలో ఉండే ఫైబర్ చక్కెరగా మారే అవకాశం ఉంది.

 ఫ్రిజ్‌లో పెట్టరాదు

ఒకవేళ మీ ఇంట్లో కోసిన ఉల్లిపాయలు మిగిలిపోతే, వాటిని మూత ఉన్న డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి.

ఫ్రెష్‌గా ఉంటాయి