AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత

Samatha J
|

Updated on: Nov 25, 2026 | 12:50 PM

Share

వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈపై సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి లిస్ట్-ఏ క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించాడు. 53 బంతుల్లో 204 పరుగులు చేసిన ఈ యువ బ్యాట్స్‌మెన్‌ను బీసీసీఐ సైతం ప్రశంసించింది.

వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈ బౌలర్లపై చెలరేగి ఆడి ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ తో ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ, డబుల్ సెంచరీలను నమోదు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను చేరుకొని అద్భుత రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగిస్తూ కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 204 పరుగులు చేశాడు. ఇందులో 196 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. అతని బ్యాటింగ్ పరాక్రమాన్ని చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయారు. బీసీసీఐ సైతం ప్రత్యేకంగా పోస్ట్ చేసి ఈ యువ బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించింది. టీమ్ ఇండియాకు మరో నయా సూపర్ స్టార్ దొరికాడని అభిమానులు సంబరపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

Follow Us