AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌

కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌

Phani CH
|

Updated on: Nov 20, 2026 | 5:34 PM

Share

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. టెస్టుల నుంచి తప్పుకోవడం కోహ్లీ కెరీర్‌లో పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ఫిట్‌నెస్ ఉన్న కోహ్లీ మరికొన్నేళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత తన నిర్ణయంపై కోహ్లీ పశ్చాత్తాపపడే అవకాశం ఉందని కపిల్ దేవ్ వ్యాఖ్యానించినట్లు కథనం పేర్కొంది.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత సంచలన వార్త. విరాట్ కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయం అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అంట. సరిగ్గా పదేళ్ల తర్వాత కోహ్లీ తన నిర్ణయానికి తీవ్రంగా పశ్చాత్తాప పడతాడని స్వయంగా భారత మాజీ లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ బాంబ్ పేల్చారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంపై క్రికెట్ వర్గాల్లో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కపిల్ దేవ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ రిటైర్మెంట్ పై సంచలన కామెంట్స్ చేశారు. ‘విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకోవడం అతని కెరీర్‌లోనే అతిపెద్ద తప్పు. రాబోయే పదేళ్లలో అతను ఈ నిర్ణయానికి కచ్చితంగా బాధపడతాడు’ అని కపిల్ దేవ్ కుండబద్దలు కొట్టారు. కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటికీ ఒక 25 ఏళ్ల కుర్రాడితో సమానంగా మైదానంలో పరుగులు తీయగల సత్తా కోహ్లీకి ఉందని కపిల్ దేవ్ ప్రశంసించారు. కోహ్లీ వద్ద అంతటి అద్భుతమైన ఫిట్‌నెస్ ఉన్నప్పుడు, కేవలం ఏదో కోపంతోనో లేక కఠిన పరిస్థితులు ఎదురయ్యాయని రిటైర్మెంట్ ప్రకటించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ ఉదాహరణను కపిల్ తెరపైకి తెచ్చారు. ఎన్నిసార్లు జట్టు నుండి డ్రాప్ చేసినా, మళ్లీ కసిగా కమ్‌బ్యాక్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించిన అమర్‌నాథ్ లాగా కోహ్లీ కూడా పోరాడాల్సి ఉండిందని, అంతేకొని ఇలా అర్థాంతరంగా తప్పుకోవడం సరికాదని కపిల్ దేవ్ హితవు పలికారు. ప్రస్తుతం కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో అతను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే

బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

వామ్మో.. గిరినాగు.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..

మనిషి మొహంలో పిల్లి రూపం.. బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి

Bird Flu: బర్డ్ ఫ్లూ టైమ్‌లో చికెన్ తినవచ్చా?

Published on: Nov 20, 2026 05:34 PM
Follow Us