హీరో విజయ్ ఆంటోనీ బజ్జీల బిజినెస్ స్టార్ట్ చేశారా?

×

హీరో విజయ్ ఆంటోనీ బజ్జీల బిజినెస్ స్టార్ట్ చేశారా?

సినిమా ప్రమోషన్స్ విషయంలో ఒక్కో హీరో ఒక్కో ప్రత్యేక శైలిని అనుసరిస్తుంటారు. కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ మాత్రం ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తుంటారు. తన కొత్త చిత్రం నాన కుట్టి ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ వీధుల్లో చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో సాధారణ ప్రయాణికుడిలా రైలులో ప్రయాణించి అభిమానులను ఆశ్చర్యపరిచిన విజయ్ ఆంటోనీ, ఈసారి మరింత ప్రత్యేకంగా కనిపించారు. హైదరాబాద్‌లో హీరోయిన్ ప్రీతి అశ్రానితో కలిసి ఓ మిర్చి బండి దగ్గరకు వెళ్లిన విజయ్ ఆంటోనీ, స్వయంగా బజ్జీలు వేసి అక్కడున్న వారికి అందించారు. హీరో చేతులతో బజ్జీలు తినే అవకాశం రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం సరదా కోసం మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ ఆంటోనీ రూపొందించిన ఒక వినూత్న వ్యూహం. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన నాన కుట్టి సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను కూడా హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. విజయ్ ఆంటోనీ చేస్తున్న ఈ రకమైన ప్రచార పద్ధతులు సినిమాకు ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో వేచి చూడాలి.

Samatha J