గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
ఖానాపురం మండలం, వరంగల్ జిల్లాలో గుప్తనిధుల పేరుతో ఓ వ్యక్తిని మోసగాళ్లు లక్షా 40 వేల రూపాయలతో నిలువునా ముంచారు. ప్రత్యేక పూజలు చేసి భూమిలో నుంచి నకిలీ బంగారాన్ని తీసి, అసలైనదని నమ్మబలికి బురిడీ కొట్టించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఒక నిందితుడిని అరెస్టు చేశారు, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
వరంగల్ జిల్లా, ఖానాపురం మండల కేంద్రంలో అత్యాశకు పోయిన ఓ వ్యక్తి గుప్తనిధుల పేరుతో కేటుగాళ్ల మోసానికి బలయ్యాడు. నిందితులు ప్రత్యేక పూజలు చేసి భూమిలో నుంచి బంగారం తీసినట్లు నమ్మించి, బాధితుడి నుంచి లక్షా 40 వేల రూపాయల నగదును కాజేశారు. నకిలీ బంగారాన్ని అంటగట్టి మోసగించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఖానాపురం మండలానికి చెందిన బాధితుడి ఇంటి పరిసరాల్లో భారీగా గుప్తనిధులు ఉన్నాయని నమ్మబలికిన మోసగాళ్లు, వాటిని బయటకు తీయడానికి ప్రత్యేక పూజలు చేస్తామని ఆశ చూపారు. బాధితుడు వారి మాటలు నమ్మి లక్షా 40 వేల రూపాయలు సమర్పించుకున్నాడు. ఈ నెల 16న బాధితుడి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నటించిన కేటుగాళ్లు, భూమిలో నుంచి ఒక పెట్టెను బయటకు తీసినట్లు మాయ చేశారు. పెట్టెలో ప్రమాదకరమైన త్రాచుపాము ఉందని, మూడు రోజుల తర్వాతే తెరవాలని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు.మూడు రోజుల తర్వాత బాధితుడు పెట్టెను తెరవగా, అందులో ఉన్నదంతా నకిలీ బంగారం అని తేలింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ మోసానికి పాల్పడిన మహేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి
బస్టాండ్లో కనువిందు చేస్తున్న అరుదైన దృశ్యం
రూ.928 ఇచ్చి.. రూ.8.23 లక్షలు కొట్టేశారు
అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన అనుకోని అతిథి
ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ

