AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!

Telangana Inter Practical Exams 2027: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్. 2027లో జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ఉండదని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు తమ సొంత కాలేజీల్లోనే పరీక్షలు రాయనున్నారు. ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్, పూర్తి వివరాలు తెలుసుకోండి.

TS Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!
Telangana Inter Practical Exams 2027
Rajashekher G
|

Updated on: Nov 25, 2026 | 7:05 PM

Share

Telangana Inter Practical Exams 2027: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. 2027లో నిర్వహించనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయడం లేదని ఇంటర్మీడియట్ విద్యా మండలి స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు తమకు చదువుతున్న జూనియర్ కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. గతంలో ఈ పరీక్షలకు కూడా జంబ్లింగ్ విధానాన్ని తీసుకురావాలని బోర్డు ప్రతిపాదించినప్పటికీ, ఆ నిర్ణయం అమలులోకి రాలేదు. దీంతో ఈసారి కూడా పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు.

సాధారణంగా ఇంటర్ థియరీ పరీక్షలకు జంబ్లింగ్ విధానం అమలవుతుంది. ఒక కాలేజీలో చదివే విద్యార్థులకు మరో కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ఇదే తరహాలో ప్రాక్టికల్ పరీక్షలను కూడా ఇతర కాలేజీల్లో నిర్వహించాలని గతంలో అధికారులు భావించారు. అయితే ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

మరోవైపు ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ లేకపోవడంతో అక్రమాలకు అవకాశం ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో సరైన మూల్యాంకనం లేకుండానే విద్యార్థులకు పూర్తి మార్కులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ప్రాక్టికల్ సబ్జెక్టుకు 30 మార్కులు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో సైన్స్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్:

  • ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్: జనవరి 29
  • ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్: జనవరి 30
  • ద్వితీయ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు
  • ప్రథమ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు

ఇక ఇంటర్ ప్రథమ సంవత్సరం థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతారని అంచనా.

Follow Us
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!
కొంపముంచిన 75 సెకన్ల రూల్.. ఒక్క బాల్ ఆడకుండానే అవుట్
కొంపముంచిన 75 సెకన్ల రూల్.. ఒక్క బాల్ ఆడకుండానే అవుట్
పులిపిర్లు పూర్తిగా రాలిపోయే సింపుల్ టిప్.. పక్కా రిజల్ట్
పులిపిర్లు పూర్తిగా రాలిపోయే సింపుల్ టిప్.. పక్కా రిజల్ట్
చర్మం పొడిబారకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు రాయాలా తెలుసా?
చర్మం పొడిబారకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు రాయాలా తెలుసా?
బుధుడి నక్షత్ర మార్పు.. ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
బుధుడి నక్షత్ర మార్పు.. ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
చిన్న పని చేసినా ఆయాసం వస్తోందా? ఈ లోపం ఉందేమో తెలుసుకోండి
చిన్న పని చేసినా ఆయాసం వస్తోందా? ఈ లోపం ఉందేమో తెలుసుకోండి