AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కార్తీక దీపం వెలిగిస్తుండగా అంటుకున్న చీర.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కార్తీక సోమవారం సందర్భంగా ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన మహిళ, రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Hyderabad: కార్తీక దీపం వెలిగిస్తుండగా అంటుకున్న చీర.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా
Woman Succumbs To Burns After Saree Catches Fire At Home
Anand T
|

Updated on: Nov 25, 2026 | 1:51 PM

Share

కార్తీక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చాపర్ల భానుమతి అనే వృద్ధురాలు ఎస్‌ఆర్ నగర్‌లోని జగన్నాథ రెసిడెన్సీలో ఉంటున్న తన కూతురు కిన్నెర వద్ద నివాసం ఉంటున్నారు. ఈ నెల 23న రెండో కార్తీక సోమవారం సందర్భంగా ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది.

ఆ మంటలు కొన్ని క్షణాల్లోనే ఒళ్లంతా వ్యాపించాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేలోపే ఆమె శరీరం దాదాపు 50 శాతంపైగా కాలిపోయింది. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం బుధవారం ప్రాణాలు కోల్పోయారు.

పండగ పూట తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితురాలి కూతురి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us