Tirupati: ఆ ఏరియాల్లోని రోడ్లపై బర్త్‌డే వేడుకలు చేస్తున్నారా?.. అయితే ఈ వార్నింగ్ మీకే?
రోడ్లపై బర్తుడేలు చేసుకుంటూ, బాణాలు కాలుస్తూ హంగామా చేసే యువతకు తిరుపతి పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు బర్త్‌డే పార్టీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
- Anand T
- Updated on: Apr 21, 2025
- 11:28 am
Uttar Pradesh: భార్య మిస్సైందని కంప్లైంట్.. కట్ చేస్తే.. భర్తకు దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన పోలీసులు!
ఇటీవలు జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కూతురికి కాబోయే భర్తలతో ఓ మహిళ లేచిపోయిన సంఘటన ఒకటయితే.. కూతురితో పెళ్లని చెప్పి..కూతురి తల్లితో వివాహం జరిపించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. తన భార్య తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. తన భార్య తప్పిపోలేదు లేచిపోయిందని తెలిసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే...
- Anand T
- Updated on: Apr 21, 2025
- 10:43 am
Akarsh: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అతనొక్కడే!.. ప్రతిష్ఠాత్మక డ్యూక్ వర్సిటీలో అడ్మిషన్ కొట్టేసిన ఆకర్ష్!
ఏపీలోని విజయవాడకు చెందిన అకర్ష్ చిట్టినేని అతి తక్కువ మంది ప్రవేశం పొందగలిగే ప్రతిష్ఠాత్మక అమెరికన్ డ్యూక్ యూనివర్సిటీలో అడ్మిషన్ సాధించాడు. మన రెండు తెలుగు రాష్ట్రా నుంచి ఈ డ్యూక్ యూనివర్సిటీలో కేవలం ఆకర్ష్ మాత్రమే చోటు దక్కించుకోగా.. దేశ వ్యాప్తంగా ఆరుగురు అడ్మిషన్లు సాధించారు.
- Anand T
- Updated on: Apr 20, 2025
- 4:16 pm
Amit Shah: ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి.. తన వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పేసిన కేంద్రమంత్రి!
తన వెయిట్ లాస్ జర్నీ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శరీరానికి అవసరమైన మేర నిద్ర, మంచి ఆహారం, నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇవి పాటించడం వల్ల జీవితంలో చాలా సాధించానని చెప్పుకొచ్చారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- Anand T
- Updated on: Apr 20, 2025
- 2:54 pm
Chennai: సమయానికి దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలు పణంగా పెట్టి..!
పక్కవాళ్లు ఏమైపోతే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో ఓ యువకుడు తన ప్రాణాలకు తెగించి ఓ విద్యార్థిని రక్షించాడు. రోడ్డుపై మలిచిన నీటిలోంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ విద్యార్థి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అది గమనించిన అటుగా వెళ్తున్న ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ విద్యార్థిని రక్షించాడు.
- Anand T
- Updated on: Apr 20, 2025
- 1:38 pm
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు.. ప్రధాని మోదీ, పవన్, జగన్ జన్మదిన శుభాకాంక్షలు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
- Anand T
- Updated on: Apr 20, 2025
- 10:36 am
Viral: మరీ ఇంత మోసమా?.. కూతురితో పెళ్లని చెప్పారు.. కట్ చేస్తే.. తల్లిని కూర్చోబెట్టారు
యూపీలోని మీరట్‌లో జరిగిన ఓ ఘటన అందరిని అశ్చర్యానికి గురిచేస్తోంది. తన పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి ఎన్నో కళలు కన్న వ్యక్తి..తీర పెళ్లయ్యాక పెళ్లి కూతురును చూసి కంగుతిన్నాడు. కూతురితో వివాహం అని చెప్పి..కూతురి తల్లితో పెళ్లి చేశారు పెళ్లి కూతురి తరపు బంధువులు. ఈ మోసంపై పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు బాధిత పెళ్లి కొడుకు.
- Anand T
- Updated on: Apr 20, 2025
- 9:39 am
Lavanya: లావణ్య సంచలన నిర్ణయం.. న్యాయం చేయకపోతే వాళ్ల ముందే ప్రాణాలు తీసుకుంటా!
టాలీవుడ్లో హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ విషయంపై నార్సింగి పీఎస్‌కు వెళ్లిన లావణ్య సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ప్రాణహాని ఉందన్న పోలీసులు పట్టించుకోవట్లేదని.. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు తీసుకుంటానన్నట్టు తెలుస్తోంది.
- Anand T
- Updated on: Apr 19, 2025
- 1:38 pm
Canada: కెనడాలో కాల్పుల మోత.. భారతీయ విద్యార్థిని మృతి!
పై చదువుల కోసం వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ కెనడాలో తుపాకుల తూటాలకు బలయ్యింది. కెనడాలోని ఒంటారియాలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హర్సిమ్రత్ రాంధావా మృతి చెందినట్లు టొరంటోలోని ఇండియన్ ఎంబసీ ధృవీకరించింది.
- Anand T
- Updated on: Apr 19, 2025
- 12:50 pm
Arvind Kejriwal: కూతురు పెళ్లి వేడుకలో పుష్ప-2 పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం.. వీడియో వైరల్!
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ వివాహం సంభవ్ జైన్‌తో ఏప్రిల్ 18,2025న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ సీనియర్ నేతలు హాజరయ్యారు.
- Anand T
- Updated on: Apr 19, 2025
- 10:21 pm
Delhi: మైనర్ బాలుడి హత్య కేసులో లేడీ డాన్ జిక్రా అరెస్ట్.. అసలు ఎవరీ జిక్రా?
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ బాలుడి మర్డర్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ డాన్ జిక్రాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్ జిక్రా కనుసన్నల్లోనే మైనర్ బాలుడి హత్య జరిగినట్టు విచారణలో తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.
- Anand T
- Updated on: Apr 19, 2025
- 10:14 am
HYD Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం!
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ వేడికి ఉక్కరిబిక్కిరి అవుతున్న నగరవాసులను వరుణుడు చల్లబర్చాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. వర్ష కారణంగా పలు ఏరియాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- Anand T
- Updated on: Apr 18, 2025
- 6:45 pm