AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War: ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇప్పటికే ఇజ్రయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించగా.. ఇరాన్ కూడా వాటిని ధీటుగా సమాధానం చేబుతూ దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ సైన్యం ఈ దాడులకు సంబంధించి కొన్ని చిత్రాలను ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసింది.

Iran Israel War: ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
Iran Israel War Frist Image
Anand T
|

Updated on: Feb 28, 2026 | 6:46 PM

Share

ఇరాన్‌పై, ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌ టార్గెట్‌గా ఇప్పటికే ఆమెరికా, ఇజ్రాయెల్ మిసైళ్లతో వరుస దాడులకు పాల్పడుతుంది. ఈ దాడుల్లో ఇరాన్‌లోని మినాబ్ నగరంలోని ఓ పాఠశాలపై బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మంది వరకు విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్‌పై దాడులకు సంబంధించిన మొదటి దృశ్యాలను పంచుకుంటూ ఇజ్రాయెల్ వైమానిక దళం ఎక్స్‌ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోలో క్షిపణి లాంచర్లు సైనిక లక్ష్యాలను ఢీకొట్టినట్లు కనిపిస్తోంది

అలాగే ఈ వీడియో కింద రాసిన క్యాప్షన్‌లో ఇజ్రాయెల్ ఇలా రాసుకొచ్చింది. ఇజ్రాయెల్ వైమానిక దళం పశ్చిమ ఇరాన్‌లో వందలాది లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అలాగే ఇరాన్‌లో వైమానిక దళ దాడులకు సమాంతరంగా, ఇజ్రాయెల్ రాష్ట్ర భూభాగం వైపు ఇరాన్ నుండి ప్రయోగించబడే దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి వైమానిక రక్షణ శ్రేణి పనిచేస్తోందని ఇజ్రాయెల్ పేర్కొంది.

వీడియో చూడండి.

మరిన్ని అంతర్జాతీయ  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us