US-Israel-Iran War Live: ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన మోదీ.. యుద్ధపరిణామాలపై కీలక చర్చ
US Israel attack Iran Live Updates : ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీకి కేంద్రహోమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. యుద్ధ పరిణామాలపై ఈ స్దందర్భంగా చర్చించారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ భీకరయుద్దం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్‌గా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. . ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్ . – ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ దాడులకు సింహగర్జన అని పేరు పెట్టింది.
ఇజ్రాయెల్-అమెరికా దాడుల తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. బంకర్ లోకి ఆయన వెళ్లిపోయారు. — ఇరాన్ డిఫెన్స్ సిస్టంపైనా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ సిస్టమ్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌కు పదే పదే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చాయి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఈ దాడుల తరువాత ఇరాన్ తన ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది.
ఇరాన్ అణ్వాయుధాలను అంతం చేసే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సెన్యం వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్న నెంబర్‌వన్ దేశంగా ఇరాన్ మారిందన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్ స్పందించింది. యుద్దం మీరు మొదలుపెట్టారు. ముగింపు మేము పలుకుతాం అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
ఇరాన్‌పై దాడుల తర్వాత ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయ్. దేశ పౌరులను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. అంతేకాదు ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని హెచ్చరించింది భారత ఎంబసీ.
మరిన్ని అంతార్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
LIVE NEWS & UPDATES
-
ముగ్గురు యూఎస్ సైనికులు మృతి
- మిడిల్ ఈస్ట్‌లో తీవ్రంగా నడుస్తున్న యుద్ధం
- ఇరాన్ దాడిలో ముగ్గురు సైనికులను కోల్పోయామన్న అమెరికా
- ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించిన USA
- ఎక్కడ మరణించారో వెల్లడించని అమెరికా ప్రభుత్వం
- ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు, ఆర్మీ బేస్‌లపై ఇరాన్ మిసైల్ దాడులు
- సైనికుల మృతికి ప్రతీకారం తప్పదన్న ట్రంప్
- అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 201 మంది మృతి, 750 మందికి గాయాలు
- ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో పదిమంది మృతి, 120 మందికి గాయాలు
- UAEలో ముగ్గురు మృతి, 58మందికి గాయాలు
-
యుఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
- యుఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
- యూఏఈపై దాడులను తీవ్రంగా ఖండించిన మోదీ
- దాడుల్లో మృతిచెందిన వారికి మోదీ సంతాపం
- యూఏఈకి అండగా నిలుస్తామన్న ప్రధాని మోదీ
- ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి..
- భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామన్న ప్రధాని మోదీ
-
-
మోదీ నివాసంలో కీలక భేటీ
- ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం
- భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ
- హాజరైన రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, జైశంకర్
- యుద్ధ పరిణామాలపై చర్చ
-
9 ఇరాన్ నౌకలను ధ్వంసం చేశాంః ట్రంప్
అమెరికా ఇప్పుడు ఇరాన్ నావికాదళాన్ని లక్ష్యంగా చేసుకుంది. తన సైన్యం తొమ్మిది ఇరానియన్ నావికాదళ నౌకలను నాశనం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మిగిలిన ఇరానియన్ నౌకలను త్వరలో నాశనం చేస్తామని ఆయన హెచ్చరించారు. త్వరలో వాటిని కూడా ముంచివేస్తామన్నారు. మరొక దాడిలో, ఇరాన్ నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని దాదాపు పూర్తిగా నాశనం చేసామన్నారు. ఈ మేరకు సోషల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.
-
ఇరాన్‌పై బీ2 బాంబులను వదిలిన అమెరికా
ఇరాన్‌పై అమెరికా వరుస దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఇరాన్‌పై బీ2 బాంబులను వదిలింది అమెరికా. 2 వేల కిలోల బాంబులను జారవిడిచింది అమెరికా. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌లోని ఐఆర్‌ఐబి ప్రధాన కార్యాలయంలోని కొన్ని భాగాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
Moments ago, US-Israeli forces targeted parts of the IRIB headquarters in Tehran.
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/AX7WMIlv96
— Press TV 🔻 (@PressTV) March 1, 2026
-
-
ఒమన్ విదేశాంగ మంత్రికి కేంద్ర మంత్రి జైశంకర్ ఫోన్
ఒమన్ విదేశాంగ మంత్రితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సంప్రదింపులు జరిపారు. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైదీకు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
-
ఏది కరెక్టో అదే చేస్తున్నా.. చర్చలకు సిద్ధంః ట్రంప్
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా సైన్యం చేసిన దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారని ట్రంప్ ప్రకటించారు. ఏది కరెక్టో అదే చేస్తున్నానన్న ట్రంప్, చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దన్నారు. కొత్త ఇరాన్ నాయకులు చర్చలు జరపాలనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న ట్రంప్, ఇరాన్ ఈ పని ముందే చేసి ఉండాల్సిందన్నారు.
-
ఇరాన్ దాడిలో గాయపడ్డ భారతీయుడు
యుఎఇలో ఇరాన్ దాడిలో అనేక మంది మరణించారు. ఒక భారతీయ పౌరుడు గాయపడినట్లు తమకు తెలుసని, ఆసుపత్రి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆ భారతీయ పౌరుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మేము అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నాము. అని భారత రాయబారి పేర్కొన్నారు.
The Embassy is aware of the injury to the Indian national and is in touch with the hospital authorities. The Indian national is out of danger. We are rendering all possible assistance. https://t.co/2YrwUvLlfO
— India in UAE (@IndembAbuDhabi) March 1, 2026
-
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు రక్షణ మంత్రి, జనరల్ స్టాఫ్ చీఫ్, మొసాద్ చీఫ్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఇరాన్‌పై ఆపరేషన్ కొనసాగించాలని వారికి నెతన్యాహు సూచించారు. ఒక వీడియో సందేశంలో, “మేము నియంత ఖమేనీని చంపాము. అతనితో పాటు, డజన్ల కొద్దీ అగ్రనాయకులు చనిపోయారు. మా దళాలు ఇప్పుడు సెంట్రల్ టెహ్రాన్‌పై వేగంగా దాడి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమవుతుంది.” అని నెతన్యాహు పేర్కొన్నారు.
ఇరాన్ దాడులను ప్రస్తావిస్తూ, “ఈ రోజులు చాలా బాధాకరమైనవి. నిన్న టెల్ అవీవ్‌లో.. ఇప్పుడు బీట్ షెమెష్‌లో, ప్రియమైన వారిని కోల్పోయాము. వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. మీ అందరి తరపున, ఇజ్రాయెల్ పౌరుల తరపున, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మా మనుగడ, భవిష్యత్తును నిర్ధారించడానికి మునుపెన్నడూ లేని విధంగా IDF పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నాము.” అని నెతన్యాహు తెలిపారు.
סיימתי עכשיו פגישה עם שר הביטחון, הרמטכ"ל וראש המוסד. נתתי הנחיות להמשך המערכה.
אתמול חיסלנו את הרודן חמינאי. יחד איתו חיסלנו עשרות מבכירי משטר הדיכוי.
כוחותינו הולמים עכשיו בלב טהרן בעוצמות הולכות וגוברות, וזה רק ילך ויתגבר עוד יותר במהלך הימים הקרובים.
עם זאת, אלה ימים… pic.twitter.com/cap0Atxlhl
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) March 1, 2026
-
ఇరాన్‌లో చిక్కుకున్న అమేథి విద్యార్థులు
ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలోని ముసాఫిర్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని భనౌలి గ్రామంలోని షియా వర్గాలలో ఖమేనీ మరణం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చదువుకోవడానికి ఇరాన్‌కు వెళ్లిన ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు ఇప్పుడు యుద్ధం మధ్య అక్కడే చిక్కుకుపోయారు. గ్రామంలో నివసించే అబ్బాస్ తన భార్య షబికాతో క
-
UAEపై ఇరాన్ ఎన్ని క్షిపణులను ప్రయోగించిందంటే?
ఇరాన్ దాడిలో తమ వైమానిక దళం ఇప్పటివరకు 165 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు, 541 ఇరానియన్ డ్రోన్‌లను ఎదుర్కొన్నట్లు యుఎఇ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 541 డ్రోన్‌లలో 506 ధ్వంసమయ్యాయని, 35 దేశంలోనే పడి నష్టాన్ని కలిగించాయని తెలిపింది. ఈ సంఘటనల ఫలితంగా పాకిస్తానీ, నేపాలీ, బంగ్లాదేశ్ పౌరులు ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మరణించగా, మొత్తం 58 మంది గాయపడ్డారు.
The Ministry of Defence has announced that the UAE air force and air defence forces have so far dealt with 165 ballistic missiles, two cruise missiles and 541 Iranian drones since the start of the Iranian attack.
The ministry said that on the morning of the second day of the… pic.twitter.com/rj8e5iXrQ5
— وزارة الدفاع |MOD UAE (@modgovae) March 1, 2026
-
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
వరుస దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్‌క్షి స్పందించారు. టెహ్రాన్ తన సోదరులపై దాడి చేయడం లేదని అన్నారు. “మేము అమెరికన్ లక్ష్యాలపై మాత్రమే దాడి చేస్తున్నాము” అని ఆయన అన్నారు. హార్ముజ్ జలసంధిని మూసివేయాలనే ఉద్దేశ్యం లేదని ఆయన తేల్చి చెప్పారు.
-
ఖమేనీ మరణంపై పుతిన్ ఆగ్రహం
ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ, అతని కుటుంబ సభ్యుల మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌కు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. మానవ నీతిని, అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా విస్మరించి ఈ హత్య జరిగిందని పుతిన్ పేర్కొన్నారు. రష్యా – ఇరాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేసిన అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా ఖమేనీ రష్యాలో గుర్తుండిపోతారని ఆయన అన్నారు. ఖమేనీ బంధువులు, అభిమానులకు, అలాగే ఇరాన్ ప్రభుత్వానికి, ఆదేశ ప్రజలకు తన సంతాపాన్ని, మద్దతును తెలియజేశారు పుతిన్.
-
తెలుగు వారంతా అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలిః సీఎం రేవంత్
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.
-
తమ పౌరులకు అమెరికా సలహా జారీ
ఇరాన్ సైన్యం తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున, బహ్రెయిన్‌లోని మనామాలో ఉన్న హోటళ్లలో బస చేయవద్దని అమెరికా తన పౌరులకు సలహా ఇచ్చింది.
Security Alert: Update 5 – U.S. Embassy Manama, Bahrain – U.S. government personnel moved from hotels (March 1, 2026)
The U.S. Embassy in Bahrain is tracking confirmed reports the Crowne Plaza Hotel in Manama was struck on March 1, 2026, resulting in injuries. We advise U.S.… pic.twitter.com/Ehok919Mg7
— U.S. Embassy Manama (@USEmbassyManama) March 1, 2026
-
పాక్ ప్రధాని షాబాజ్ తొలి స్పందన
ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం పట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం వారికి తోడుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఖమేనీ మరణాన్ని షాబాజ్ అమరవీరునిగా అభివర్ణించారు.
-
ప్రధాని మోదీ CCS అత్యవసర సమావేశానికి పిలుపు
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సిసిఎస్ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరవుతారు.
-
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి
జెరూసలేం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీట్ షెమెష్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అల్ జజీరా కథనం ప్రకారం, ఈ దాడిలో కనీసం నలుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.
-
హింస పెరిగితే భయంకరమైన విషాదమేః పోప్
ఇరాన్ పరిస్థితిపై పోప్ లియో XIV తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. వినాశకరమైన యుద్ధాన్ని నివారించడానికి హింసను విరమించుకోవాలన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన అన్ని పక్షాలను కోరారు. హింస పెరిగితే అది భయంకరమైన విషాదానికి దారితీస్తుందని పోప్ హెచ్చరించారు.
-
ట్రంప్ నినాదాలతో హోరెత్తిస్తూ సంబరాలు
ఇరాన్‌పై అమెరికా దాడులకు అమెరికాలో ఉంటున్న ఇరానియన్లు మద్దతు పలికారు. థ్యాంక్యూ ట్రంప్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రంప్ నినాదాలతో హోరెత్తిస్తూ సంబరాలు చేసుకున్నారు.
-
ఇరాన్‌పై దాడులను ఖండించిన చైనా, రష్యా
ఇరాన్‌పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించింది.
చర్చలు కొనసాగుతున్నప్పుడు దాడులు చేయడం కరెక్ట్ కాదు. చర్చలకు తిరిగి రావాలని కోరుతున్నాంః రష్యా
ఇరాన్‌లో పాలనను మార్చాలనుకోవడం సరైనది కాదు. దాడులను వెంటనే ఆపాలిః చైనా
-
హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ
ఇరాన్‌పై దాడిని నిరసిస్తూ హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ చేశారు ముస్లింలు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసన తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
-
జమ్మూ కశ్మీర్‌లో రోడ్లపైకి జనం..!
ఇరాన్‌పై దాడిని నిరసిస్తూ జమ్మూ కశ్మీర్‌లోని పలుచోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. శ్రీనగర్, లాల్ చౌక్, పఠాన్‌కోట్, కుల్గాం, రాంబన్, బద్గాం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం నిరసనలు తెలిపారు. ఖమేనీని అమెరికా పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల ఖమేనీ ప్లకార్డులు, చిత్రపటాలతో ర్యాలీలు నిర్వహించారు.
-
ఇరాన్‌పై దాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్‌పై ఆమెరికా-ఇజ్రాయెల్ దాడి, ఆదేశ సుప్రీమ్ ఖమేనీని హత్య చేయడం అమానుషమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది అంతర్జాతీయ చట్టాలపై ఉల్లంఘనే అన్న ఒవైసీ, ఇరుదేశాలు యుద్ధం ఆపేసి శాంతి చర్చలు ప్రారంభించాలన్నారు. ఈ విషయంలో భారత్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఒవైసీ కోరారు. కేంద్రంలోని బీజేపీ కూడా హింసాత్మక చర్యలను ఖండించాలన్నారు. ఈ దాడిలో స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఒవైసీ, యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.
-
ఇరాన్‌పై దాడిని ఖండించిన వామపక్ష పార్టీలు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని, ఖమేనీ హత్యను ఖండించిన వామపక్ష పార్టీలు
అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయడాన్ని ఖండించిన 10 వామపక్ష పార్టీలు.
ఇరాన్ ప్రజలతో పాటు ఆ దేశ సుప్రీం ఖమేనీ భవనంపై దాడిచేసి, హత్య చేయడం, పాఠశాలలపై బాంబులు వేసి పిల్లలను చంపడం సామ్రాజ్యవాద దురహంకారానికి ఇది పరాకాష్ట అని వామపక్ష నేతలు మండిపడ్డారు.
ఇరాన్ దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమే అన్నారు.
ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను స్వంత నివాసం నుండే కిడ్నాప్ చేసి అమెరికాలో నిర్బంధించారు.
ఆ దేశంలోని ఆయిల్ వనరులపై ఆధిపత్యం తమదేనని ట్రంప్ ప్రకటించడం ద్వారా తన అసలు స్వరూపం ప్రదర్శించారని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఇరాన్‌పై దాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్‌పై దాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
ఖమేనీని హత్య చేయడం అమానుషం
ఇది అంతర్జాతీయ చట్టాలపై ఉల్లంఘనే-ఒవైసీ
ఇరుదేశాలు యుద్ధం ఆపేసి శాంతి చర్చలు ప్రారంభించాలి
భారత్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి-ఒవైసీ
కేంద్రంలోని బీజేపీ కూడా హింసాత్మక చర్యలను ఖండించాలి
దాడిలో స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరిగే ప్రమాదం
సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది-ఒవైసీ
-
షార్జాలో అతి పెద్ద షాపింగ్ మాల్ ధ్వంసం!
UAEపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
షార్జాలోని అతి పెద్ద షాపింగ్ మాల్‌పై వరుస బాంబుల వర్షం
అతి పెద్ద షాపింగ్ మాల్ ధ్వంసం, భారీగా ఎగిసిపడుతున్న పొగలు
షాపింగ్ మాల్‌లో పలువురు చిక్కుకున్నట్టు అనుమానాలు.
షాపింగ్ మాల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొనసాగుతున్న సహాయకచర్యలు
-
గచ్చిబౌలిలో హై అలర్ట్..!
ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.
అమెరికా – ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం నేపధ్యంలో యుఎస్ కాన్సులేట్ దగ్గర ప్రతిష్ఠ భద్రత.
గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ నానక్‌రామ్‌గూడ లోని US కాన్సులేట్ దగ్గర భారీగా మొహరించిన సైబరాబాద్ పోలీసులు.
ఇరాన్ సుప్రీం లిడర్ ఖమెని మృతి పై నగరంలో ర్యాలీ ఉండటంతో యుఎస్ కాన్సులేట్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేసిన గచ్చిబౌలి పోలీసులు.
చుట్టుపక్కల ఉన్న స్టార్ హోటల్స్ లో అనుమానంత వ్యక్తులపై నిఘా పెంచిన పోలీసులు.
US కాన్సులేట్ చుట్టుపక్కల భారీ పోలీసుల మోహరింపు…
US కాన్సులేట్ వైపు వెళ్లే దారిని తాత్కాలికంగా భారీ గేట్స్ తో మూసివేసిన పోలీసులు.
-
ప్రతీకార దాడలకు సిద్ధమైన IRGC
ఖమేనీ మరణం తరువాత IRGC ప్రతీకార దాడలకు సిద్ధమవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్ వీధుల్లో భద్రతను పెంచారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వారి రాయబార కార్యాలయాలకు హెచ్చరిక జారీ చేశాయి. అలీ ఖమేనీ మరణ వార్తల మధ్య కొంతమంది ఇరానియన్-అమెరికన్లు అమెరికా రాజధాని వాషింగ్టన్, DCలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
-
ఖమేనీని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా – ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యారు. దాడుల వార్తల మధ్య అనేక భావోద్వేగ వీడియోలు వెలువడ్డాయి. ఇరాన్ స్టేట్ టీవీ నుండి వచ్చిన అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అలీ ఖమేనీ మరణ వార్త చదువుతున్నప్పుడు ఒక టీవీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖమేనీని దేశానికి బలమైన నాయకుడిగా ఆ యాంకర్ అభివర్ణించారు. అధికారిక ప్రకటన గురించి ప్రస్తావించగానే ఆయన గొంతు ఉక్కిరిబిక్కిరి అయింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇస్లామిక్ విప్లవ సుప్రీం నాయకుడు ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ మరణించారని యాంకర్ చెప్పాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ईरान के सर्वोच्च नेता अयातुल्ला अली खामेनेई की मौत की खबर पढ़ते हुए ईरानी सरकारी TV का एंकर फूट फूट कर रोया
ईरानी सुप्रीम लीडर की मौत के बाद वहां चालीस दिन का शोकअरब देशों में भी तीन दिन के राष्ट्रीय शोक का एलान कियाईरान ने कहा इस हत्या का बदला लिया जाएगा
खामेनेई की मौत के… pic.twitter.com/WOkgf2MkrI
— Dibang (@dibang) March 1, 2026
-
ఖమేనీకి వారసుడిగా మొజ్తబా
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ
ఇరాన్‌కు నేతృత్వం వహించనున్న మొజ్తబా ఖమేనీ
ఖమేనీకి వారసుడిగా మొజ్తబాను ప్రకటించిన ఇరాన్
అయుతుల్లా ఖమేనీ మృతితో రెండో కొడుకు మొజ్తబాకు బాధ్యతలు…
-
ఇదే మీకు మంచి అవకాశం: ఇరానీయులకు నెతన్యాహు మెసేజ్
- ఇరాన్‌లోని నిరంకుశ పాలనను పడగొట్టడానికి ఏకం కావాలని ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రధాని పిలుపు
- ఫ్యూచర్ బాగుండాలంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలని సూచన
-
పక్కా ప్రణాళికతో ఖమేనీని అంతం చేసిన అమెరికా, ఇజ్రాయెల్
అమెరికా టార్గెట్ ఖమేనీ అని తెలుసు. ఎప్పుడైనా, ఎలాగైనా దాడి జరుగుతుందని తెలుసు. దేశాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, తమ సుప్రీం లీడర్‌ను కాపాడుకోవం కూడా అంతే ముఖ్యమని ఇరాన్ సైన్యానికి తెలుసు. కానీ ఖమేనీ ఆచూకీ అమెరికా-ఇజ్రాయెల్‌కు ఎలా తెలిసింది. అంత ఖచ్చితంగా ఎటాక్స్ ఎలా జరిగాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
— పక్కా ప్రణాళికతో ఖమేనీని అంతం చేశాయి అమెరికా, ఇజ్రాయెల్
— సుప్రీం లీడర్‌పై చేసిన దాడిలో కీలకంగా మారింది టైమింగ్
— ఖమేనీ కీలక సమావేశాన్ని ముందే పసిగట్టింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్
— షెడ్యూల్ ప్రకారం శనివారం సాయంత్రం ఖమేనీ కీలక మీటింగ్ నిర్వహించాల్సి ఉంది.
— సైనికాధికారులు, సలహాదారులతో ఖమేనీ సమావేశం ఖరారు అయింది.
— కానీ మీటింగ్‌ను సాయంత్రం నుంచి ఉదయానికి మార్చారు ఖమేనీ
— అయితే, ఖమేనీ కదలికలను, సమావేశ వివరాలను అమెరికా గూఢచర్య సంస్థ CIA, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ క్షణక్షణం ట్రాక్ చేస్తూ వచ్చాయి.
— ఈ సమావేశం తర్వాత ఖమేనీ రహస్య ప్రాంతానికి వెళ్లొచ్చని ముందే పసిగట్టాయి రెండుదేశాల ఇంటెలిజెన్స్‌లు.
— టెహ్రాన్‌లో ఖమేనీ కీలక భేటీ నిర్వహిస్తుండగానే ఖచ్చితమైన అంచనాలతో గురిచూసి దాడిచేశాయి ఈ రెండుదేశాలు.
— ఈ దాడిలో ఖమేనీతోపాటు, పలువురు సైనికాధికారులు చెందారు.
— ఖమేనీ మీటింగ్ వివరాలు ఎలా లీక్ అయ్యాయన్న అంశంపై ఇరాన్ తర్జనభర్జన పడుతోంది.
-
హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ
–హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ చేశారు ముస్లింలు
— సియా, సున్నీ వర్గాలకు చెందిన ముస్లింల నిరసన….
–ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసన…
–ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు…
— అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో పోలీసులు మోహరింపు…
-
ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ భీకర దాడులు.. లేటెస్ట్ అప్ డేట్స్
- 01. ఇరాన్ సుప్రీం ఖొమేనీ మృతిని ఇజ్రాయెల్‌లో ఉంటున్న ఇరానియన్లు సమర్థించారు. రాచరికపు పాలనకు ముగింపు దొరికిందంటూ హర్షం ప్రకటించారు. ట్రంప్‌కు మద్దతుగా డాన్సులు చేశారు.
- 02. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను చైనా ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని కోరింది.
- 03. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను కెనడా ప్రధాని కార్నీ ఖండించారు. తక్షణమే దాడులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ట్రంప్ దుందుడుకు చర్యలను ప్రపంచదేశాలు ఖండించాలని కోరారు.
- 04. ఖొమినీ మృతిపై ఇరాక్ బాగ్దాద్‌లో షియా ముస్లింలు వేలాదిగా రోడ్డెక్కారు. అమెరికా ఎంబసీ దగ్గర నినాదాలతో హోరెత్తించారు. ఎంబసీ ముట్టడికి యత్నించిన ఆందోళన కారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
- 05. ఖొమేనీ మృతికి వ్యతిరేకంగా పాకిస్థాన్ కరాచీలో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళన కారులు అమెరికా ఎంబసీని ధ్వంసం చేశారు. ఎంబసీకి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కాల్పులకు దిగడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 06. ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో వణికిపోయామని స్టార్ షట్లర్ PV సింధు చెప్పారు. దుబాయ్‌లో పరిస్థితులపై ఆమె ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ దగ్గర ఇరాన్ బాంబుల దాడితో భయంతో పరుగులు తీశామన్నారు.
- 07. ఫ్యామిలీతో దుబాయ్‌లో ఉన్న సినీ నటుడు మంచు ఇరాన్ దాడులపై స్పందించారు. డ్రోన్ దాడులతో భయపెట్టాయన్నారు. దాడి దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు
- 08. దుబాయ్‌పై ఇరాన్ దాడులతో తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియక క్షణమొక యుగంలా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- 09. ఇరాన్ దాడులతో ఉద్రిక్తంగా మారిన దుబాయ్‌లో సినీ నటి సోనాల్ చౌహాన్ చిక్కుకున్నారు. తనను క్షేమంగా భారత్‌కు తీసుకెళ్లాలని భారత ఎంబసీని ఎక్స్ వేదికగా వేడుకున్నారు.
-
దుబాయ్‌లో చిక్కుకున్న బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు
ఇరాన్ దాడుల నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. పేలుడు సంభవించినప్పుడు నేను విమానాశ్రయం దగ్గరే ఉన్నా.. దట్టమైన పొగ ఆవరించిందిం, వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.. ఆ క్షణాలు ఎంతో భయంకరం.. అన్నారు.. సంక్షోభ సమయంలో ఏర్‌పోర్ట్ స్టాఫ్, అధికారులు, భారత హైకమిషన్ స్పందించిన తీరును మెచ్చుకున్నారామె. పరిస్థితులు త్వరలోనే చక్కబడాలని కోరుకుంటున్నా అన్నారు. పీవీ సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్ కోసం బర్మింగ్‌హామ్ వెళ్ళాల్సి ఉంది. ట్రాన్సిట్ స్టాప్ కనుక దుబాయ్‌లో ఆగారు.
-
నెత్తురోడిన పాకిస్తాన్
- నెత్తురోడిన పాకిస్తానీ నగరం కరాచీ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పైకి స్థానికుల దాడి
- ఆందోళనకారులను తిప్పికొట్టిన అమెరికా మెరైన్ కమెండోలు
- కమెండోల కాల్పుల్లో 12 మందికిపైగా మృతి
- కాల్పుల్లో పలువురికి గాయాలు
- ఇరాన్‌కు మద్దతుగా ర్యాలీ చేపట్టిన కరాచీ ప్రజలు
- అదుపుతప్పి హింసాత్మకంగా మారిన ర్యాలీ
- రాళ్లు, కర్రలతో దాడిచేసిన ఆందోళనకారులు
- కాన్సులేట్‌కు నిప్పుపెట్టిన నిరసనకారులు
- నిరసకారులను అదుపుచేయడానికి తొలుత బాష్పవాయు గోళాల ప్రయోగం
- ఆందోళనకారులపై కాల్పులు జరిపన అమెరికా మెరైన్ కమెండోలు
-
UNలో అమెరికా ప్రతినిధి కీలక ప్రసంగం..
- UNలో అమెరికా ప్రతినిధి కీలక ప్రసంగం..
- ప్రతి దేశానికి వాళ్ల రక్షణ అనేది ప్రాథమిక కర్తవ్యం
- ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొన్ని నిర్దేశిత లక్ష్యాలపైనే జరుగుతోంది
- మా భద్రతకు ముప్పుగా ఉన్న వాటిపైనే దాడి చేస్తున్నాం
- ఆయుధాలు, ఇతరత్రా సామాగ్రి ఉన్న చోటే దాడులు చేస్తున్నాం
- న్యూక్లియర్ వెపన్స్‌తో ఇరాన్ ఎవ్వరినీ బెదిరించకూడదు
- అణుశక్తిపై ఇరాన్ ముందుకు వెళ్లొద్దనే మా దాడులు
- శాంతి అనేది బెదిరింపుదారులకు ఆయుధం కావొద్దు
-
ఇది యుద్ధం కాదు.. అమెరికా చేస్తున్న హత్యలు
- UNలో ఇరాన్ ప్రతినిధి కీలక ప్రసంగం
- ఇరాన్‌లో సామాన్య పౌరులపై దాడులు చేస్తున్నారు
- స్కూల్‌పై దాడితో 100మందికిపైగా విద్యార్థులు చనిపోయారు
- దాడుల్లో వందలమంది పౌరులు చనిపోతున్నారు
- ఇది యుద్ధం కాదు.. అమెరికా చేస్తున్న హత్యలు
- అమెరికా అన్యాయంగా మాపై దాడులు చేస్తోంది
- అమెరికా – ఇజ్రాయెల్ బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నాయి
- రాజకీయ కారణాలతో మాపై దాడులు చేస్తున్నారు
- ఇది ఇరాన్‌పై దాడి కాదు.. ఐక్యరాజ్యసమితిపై దాడిగా పరిగణించాలి
- అంతర్జాతీయ చట్టాలపై జరుగుతున్న దాడిగా పరిగణించాలి
-
దుబాయ్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు
- దుబాయ్ గగనతలంపై వరుసగా మిస్సైళ్లు, డ్రోన్ల దాడులు
- ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఛేదించుకుని మరీ విధ్వంసం
- దుబాయ్‌లో రెండు డ్రోన్లను కూల్చేసిన భద్రతా బలగాలు
- డ్రోన్ శకలాలు పడి ఇద్దరికి గాయాలు
- US సైనిక స్థావరాలపై భీకరదాడులు తప్పవు ఇరాన్ హెచ్చరిక
-
పాక్‌లో యూఎస్ కాన్సులేట్‌పై దాడి
- ఖమేనీ అంతం తర్వాత పాకిస్తాన్‌లో ఆగ్రహం
- కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి
- ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా స్థానికుల ఆగ్రహం
- కర్రలు, రాళ్లతో దాడులు చేసిన స్థానికులు
-
ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్
- ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరికలు
- ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్‌కు మంచిదంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో సలహా
- కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామన్న ట్రంప్
- ఇరాన్ ప్రతీకారదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామన్న ట్రంప్.
-
అమెరికాపై రగిలిపోతున్న ఇరాన్
- అమెరికాపై రగిలిపోతున్న ఇరాన్
- అమెరికాపై తీవ్రంగా దాడులు చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ హెచ్చరిక
- అమెరికా హద్దుమీరింది.. మూల్యం చెల్లించుకోక తప్పదని శపథం
- అమెరికా మిలటరీ స్థావరాలపై భీకరదాడులు తప్పవని ఇరాన్ వార్నింగ్
-
దుబాయ్‌లో చిక్కుకున్న పుణె విద్యార్థులు
- దుబాయ్‌లో చిక్కుకున్న పుణె విద్యార్థులు
- స్టడీ టూర్‌కు వెళ్లిన ఇందిరా యూనివర్సిటీ స్టూడెంట్స్
- 80మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు
- విమానాల రద్దుతో ఓ హోటల్‌లో స్ట్రక్ అయిన విద్యార్థులు
-
దుబాయ్‌లో సినీ నటి సోనాల్ చౌహాన్
- దుబాయ్‌లో చిక్కుకున్న సినీ నటి సోనాల్ చౌహాన్
- రక్షించాలంటూ ప్రధాని, భారత ఎంబసీకి ట్వీట్
- దుబాయ్‌లో భయానక పరిస్థితులు ఉన్నాయన్న సినీనటి
- లెజెండ్ సహా పలు సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్
-
చరిత్ర సృష్టించామన్న ఇరాన్
- పశ్చిమాసియాలో దాడులతో చరిత్ర సృష్టించామన్న ఇరాన్
- ఒకే రోజు 6 దేశాల్లోని US బేస్‌లపై మెరుపుదాడులు
- బహ్రెయిన్‌లోని 5వ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్‌పై ఇరాన్ దాడి
- ఖతార్‌లోని అల్ ఉదైద్ బేస్‌లోని US సెంట్రల్ కమాండ్‌పై దాడి
- UAEలోని అల్ దఫ్రా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ ఎటాక్
- కువైట్‌లోని అమెరికా దళాలను టార్గెట్ చేసిన దాడి
- జోర్డాన్‌లోని US స్థావరాల దగ్గర మిసైళ్లతో దాడ
- సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో కంపెనీతోపాటు..
- అమెరికా స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్
-
దుబాయ్‌పై విరుచుకపడిన ఇరాన్
- అమెరికా బేస్‌క్యాంపులు, మిత్రదేశాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్
- దుబాయ్‌లోని పలు ప్రాంతాలపై ఇరాన్ భీకర దాడులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి
- నలుగురు ప్రయాణికులకు గాయాలు
-
27 అమెరికా స్థావరాలు టార్గెట్‌గా దాడులు..
- ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకార దాడులు కొనసాగిస్తున్న IRGC
- 27 అమెరికా స్థావరాలు టార్గెట్‌గా 6వ ఎటాక్ చేశామన్న ఇరాన్
- టెల్‌నోఫ్ ఎయిర్‌బేస్, టెల్ అవీవ్‌లో సైనిక ప్రధాన కార్యాలయంపై..దాడులు చేసినట్టు చెప్తున్న ఇరాన్
- భవిష్యత్‌లో భీకర దాడులు చూస్తారని ఇజ్రాయెల్, అమెరికాకు హెచ్చరిక
- ఇరాన్‌లో 30 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు
- ఇప్పటికే అగ్రనాయకత్వాన్ని మట్టుపెట్టామంటున్న అమెరికా-ఇజ్రాయెల్
-
జెరూసెలం గగనతలంలో ఇరాన్ డ్రోన్‌లు
- ఇజ్రాయెల్ నగరాలపైకి ఇరాన్ డ్రోన్ దాడులు
- జెరూసెలం గగనతలంలో కనిపించిన ఇరాన్ డ్రోన్‌లు
- ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సైరన్ శబ్దాలు
- కొన్ని ఇరాన్ డ్రోన్లను గాల్లో ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
-
ఇరాన్‌లో భిన్న పరిస్థితులు
- ఖమేనీ హతం తర్వాత ఇరాన్‌లో భిన్న పరిస్థితులు
- ఒకవైపు వీధుల్లోకి వచ్చి రోదిస్తోన్న ఖమేనీ మద్దతుదారులు
- ఇరాన్ జెండాలు పట్టుకున్న ప్రజల నిరసన ప్రదర్శనలు
- మరోవైపు సంబరాలు చేసుకుంటున్న ఖమేనీ వ్యతిరేకులు
- ఖమేనీ నియంతపాలన అంతమైందని కేరింతలు
- ఇంకోవైపు ఇరాన్‌లో ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు
- సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ ప్రజలకు మొబైల్ సందేశాలు
- వీధుల్లోకి రాకూడదని, కిటికీల దగ్గర, తలుపుల దగ్గర ఉండరాదని హెచ్చరికలు
-
ఇరాన్ ప్రతీకార దాడులు
- ఖమేనీ హతం తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు
- ఇజ్రాయెల్ నగరాలపైకి ఇరాన్ డ్రోన్ దాడులు
- జెరూసెలం గగనతలంలో కనిపించిన ఇరాన్ డ్రోన్‌లు
- ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సైరన్ శబ్దాలు
- కొన్ని ఇరాన్ డ్రోన్లను గాల్లో ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరు ప్రకటన
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరు ప్రకటన
- ఇరాన్‌కు నేతృత్వం వహించనున్న మొజ్తబా ఖమేనీ
- ఖమేనీకి వారసుడిగా మొజ్తబాను ప్రకటించిన ఇరాన్
- ఖమేనీకి రెండోకుమారుడు మొజ్తబా
- ప్రస్తుతం ఖోమ్ నగరంలోని విద్యాలయంలో మతాచార్యుడిగా మొజ్తబా
- 1987-88లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పనిచేసిన మొజ్తబా
-
ఇజ్రాయెల్ కీలక ప్రకటన
- ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన
- ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో..
- ఐక్యరాజ్యసమితిలో చెప్పిన ఇజ్రాయెల్ ప్రతినిధి
- న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ తయారీ..
- తమ భద్రతకు విఘాతంగా మారాయి
- న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ ధ్వంసం చేసే వరకు..
- మా జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది -ఇజ్రాయెల్ ప్రతినిధి
-
కొత్త కమాండర్ ఇన్ చీఫ్‌గా అహ్మద్ వాహిది
- ఐఆర్‌జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్‌గా అహ్మద్ వాహిది
- టెహ్రాన్‌పై క్షిపణి దాడుల్లో కీలక అధికారులు మృతి
- ఖమేనీ సలహాదారు అలీ షంఖానీతో పాటు..
- ఐఆర్‌జీసీ కమాండర్ మహ్మద్ పక్పూర్ మృతి
-
దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు
- దుబాయ్‌లో పరిస్థితులపై పీవీ సింధు మరో ట్వీట్
- ఎయిర్‌పోర్ట్ దగ్గరలో బాంబులు పడ్డాయి – పీవీ సింధు
- కోచ్ సహా తామంతా పరుగులు తీశామన్న పీవీ సింధు
- భయానక పరిస్థితులు కలవరపెడుతున్నాయి
- ప్రస్తుతం తామంతా సురక్షితంగా ఉన్నాం – పీవీ సింధు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్, అథారిటీకి థ్యాంక్స్
- ఇండియన్ హై కమిషన్ తమ భద్రపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది -సింధు
- త్వరగా పరిస్థితులు చక్కబడాలని పీవీ సింధు ఆకాంక్ష
-
ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ట్రంప్
- ఇరాన్‌పై దాడులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ట్రంప్
- ఫ్లోరిడాలోని రోజంతా దాడులపైనే ట్రంప్ ఫోకస్
- ఇరాన్‌పై దాడులను నిన్న ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
- ఖమేనీని చంపేస్తామంటూ హింట్ ఇచ్చిన ట్రంప్
- ఖమేనీ మరణాన్ని తొలుత అధికారికంగా ప్రకటించిన ట్రంప్
- ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, అమెరికా ఆయుధాలతో ఇరాన్‌పై మెరుపుదాడులు
-
ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్
- ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్
- ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన
- ఇంతపెద్ద నేరం చేసిన తర్వాత జవాబు చెప్పకుండా ఉండలేమన్న ఇరాన్
- చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో..
- అమెరికా స్థావరాలపై వినాశనకర దాడలు చేస్తామని హెచ్చరిక
- ఖమేనీ బంకర్లలో దాక్కున్నారంటూ..
- శత్రువులు తప్పుడు ప్రచారం చేశారన్న రెవల్యూషనరీ గార్డ్
- ఖమేనీ వారసుడిని త్వరలోనే ప్రకటించనున్న ఇరాన్
-
ఆపరేషన్ కిల్ ఖమేనీ సక్సెస్
- ఆపరేషన్ కిల్ ఖమేనీ లో అమెరికా-ఇజ్రాయెల్ విజయం
- రెండుదేశాల దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
- ఖమేనీ తన కార్యాలయంలోనే ఉండగానే ఖమేనీ హతం
- సుప్రీం లీడర్ ఆచూకీని కనుగొన్న అమెరికా- ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్
- పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చిన రెండుదేశాలు
- ఖమేనీ ఆఫీస్‌పై 30కి పైగా కామికోజ్ డ్రోన్లు, తొమాహాక్ మిసైళ్ల మెరుపుదాడులు
-
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
- ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ మీడియా
- అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు వెల్లడి
- ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి
- ఖమేనీ మృతికి తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఖమేనీ మృతితో ఇరాన్‌లో ఆయన వ్యతిరేకుల సంబరాలు
- సుప్రీం లీడర్ మృతితో ఇరాన్ 40 రోజుల సంతాప దినాల ప్రకటన
-
భారీగా విమానాలు రద్దు
- ఇరాన్, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఎయిర్ స్పేస్ మూసివేత
- భారత్ నుంచి భారీగా విమానాలు రద్దు
- నిన్న 410, ఇవాళ 444 విమానాలు రద్దు!
- విమానయాన సంస్థలతో DGCA నిరంతరం సంప్రదింపులు
- ప్రయాణికుల భద్రత, ప్రత్యామ్నాయ ల్యాండింగ్ ఫోకస్
-
బెంజ్‌మెన్ నేతన్యాహు కీలక ప్రకటన..
ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఖమేనీ మృతిచెందారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజ్‌మెన్ నేతన్యాహు సైతం ప్రకటించారు. ఖమేనీ హతమైనట్టు ఆధారాలు కనిపిస్తున్నాయని.. పేర్కొన్నారు.
-
డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్..
అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం దశాబ్దాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాడిని ఇరాన్‌పై ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందారని.. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
-
దుబాయ్ లో మంచు విష్ణు..
దుబాయ్ పై ఇరాన్ మిస్సైళ్ళతో విరుచుకుపడుతోంది. అయితే ప్రస్తుతం తాను ఫ్యామిలీతో అక్కడే ఉన్నట్టు హీరో మంచు విష్ణు ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో ఓ మిస్సైల్ పైనుంచి దూసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే వీడియోలో విష్ణు ఫ్యామిలీ భయంతో ఉన్నట్టు చూడవచ్చు. శాంతి కోసం ప్రార్దిస్తున్నట్టు విష్ణు చెప్పారు.
-
గల్ప్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్
ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ పీఎం షరీఫ్ ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. అబుదాబీలో జరిగిన దాడుల్లో పాకిస్తాన్ పౌరుడు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
-
ట్రంప్ కు ఇరాన్ బిగ్ వార్నింగ్
యుద్ధం నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు మా వద్ద ఉన్న పాత ఆయుధాలనే ఉపయోగించాం. త్వరలో మేము వాడే వెపన్స్ నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు అని హెచ్చరించింది.
-
ఎయిర్ పోర్టులో చిక్కుకున్న భారత ప్లేయర్స్
ఐరన్ దాడుల నేపధ్యంలో పలు గల్ఫ్ దేశాల ఎయిర్ పోర్టులలో భారత ఆటగాళ్లు చిక్కుకున్నారు. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు చిక్కుకోగా.. ఖతర్ లోని దోహా ఎయిర్ పోర్టులో భారత బాస్కెట్ బాల్ టీం ఇరుక్కుపోయింది. సింధు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ఆడేందుకు బర్మింగ్ హామ్ వెళ్లాల్సి ఉండగా.. ఖతర్ లో 2027 ప్రపంచకప్ కోసం ఫిబ్రవరి 27న క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడిన భారత బాస్కెట్ బాల్ టీం భారత్ తిరిగి రావాల్సి ఉంది.
-
దూబాయ్‌పై ఇరానియన్ డ్రోన్ దాడి.. ఇదిగో వీడియో
దూబాయ్‌పై ఇరానియన్ డ్రోన్ దాడి
డ్రోన్ దాడితో దూబాయ్‌లో భారీ పేలుడు
భయాందోళనలో దూబాయ్ వాసులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాడి వీడియో
-
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించిన రష్యా
రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. సార్వభౌమాధికారం ఉన్న స్వతంత్ర ఐక్యరాజ్యసమితి సభ్య దేశంమైన ఇరాన్‌పై ముందస్తు ప్రణాళికతో, రెచ్చగొట్టే విధంగా ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు చేయడం సాయుధ దురాక్రమణ చర్యగా రష్యా పేర్కొంది. అలాగే, సైనిక చర్యలను వెంటనే నిలిపివేసి దౌత్య మార్గానికి తిరిగి రావాలని డిమాండ్ చేసింది.
-
ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. ఎమర్జెన్సీ మీటింగ్‌కు UN పిలువు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సభ్య దేశాలకు ఐక్యరాజసమితి అత్యవసర సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న పరిస్థితిని పరిష్కరించడానికి తన భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి అన్ని సభ్య దేశాలు హాజరుకావాలని పిలుపునిచ్చింది.
-
ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన చైనా
ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలన్న చైనా
ఇరాన్‌పై దాడులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన
టెహ్రాన్ జాతీయ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ప్రకటన
కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన చైనా
-
ఇరాన్ సుప్రీం లీడర్ మరణవార్తలపై ఇరాన్ మీడియా కీలక ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ త్వరలో మీడియా ముందు వస్తారని ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్ దాడిలో మరణించారనే దానిలో వాస్తవం లేదు: ఇరాన్ మీడియా
తప్పడు ప్రచారం నేపథ్యంలో త్వరలోనే ఆయన ప్రసంగిస్తారని ప్రకటన
-
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఐక్యరాజ సమితి సెక్రటరీ జనరల్ కీలక ప్రకటన
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఐక్యరాజ సమితి సెక్రటరీ జనరల్ కీలక ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతను ఖండిస్తున్నాట్టు పేర్కొన్నారు. ఇరాన్‌పై యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ బలప్రయోగం, ఆ తరువాత ఈ ప్రాంతం అంతటా ఇరాన్ ప్రతీకారం అంతర్జాతీయ శాంతి, భద్రతను దెబ్బతీస్తున్నాయన్నారు. యూఎన్ చార్టర్‌తో సహా అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్ని సభ్య దేశాలు తమ బాధ్యతలను గౌరవించాలని కోరారు. ఏదైనా దేశం ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా లేదా ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు విరుద్ధంగా బలప్రయోగం చేయడాన్ని చార్టర్ స్పష్టంగా నిషేధిస్తుందని పేర్కొన్నారు. వెంటనే శత్రుత్వాలను నిలిపివేయాలని, ఉద్రిక్తతను తగ్గించాలని మూడు దేశాలకు పిలుపునిచ్చారు.
ఒక వేళ అలా చేయకపోతే పౌరులు, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర పరిణామాలతో విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుందన్నారు. అన్ని పార్టీలు వెంటనే చర్చలకు తిరిగి రావాలని ఆయన కోరారు. UN చార్టర్‌తో సహా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, అంతర్జాతీయ వివాదాల శాంతియుత పరిష్కారానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయం లేదని నేను పునరుద్ఘాటిస్తున్నానన్నారు. అంతర్జాతీయ శాంతి, భద్రతను నిర్వహించడానికి చార్టర్ పునాదిని అందిస్తుందని పేర్కొన్నారు.
-
ఆర్మీ చీఫ్ చనిపోయారనే వార్తలపై ఇరాన్ రియాక్షన్
ఆర్మీ చీఫ్ చనిపోయారనే వార్తలపై ఇరాన్ రియాక్షన్
మా ఆర్మీ చీఫ్ చనిపోలేదంటూ ప్రకటన
-
దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఇరాన్ మిస్సైల్ దాడులు
పామ్ జుమైరా హోటల్‌పై ఇరాన్ మిస్సైల్ దాడి
-
ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడంటూ వార్తలు
దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయాడంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు
తమ సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారన్న ఇరాన్ ఆర్థికమంత్రి
ఇరాన్ అధ్యక్షుడితోపాటు ఉన్నతాధికారులంతా సురక్షితమని ప్రకటన
-
హర్మూజ్ జలసంధి మూసివేత
ఇజ్రాయిల్ అమెరికా దాడులపై అంతే ధీటుగా స్పందిస్తున్న ఇరాన్.. కౌంటర్ ఎటాక్స్ అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కొద్దిరోజుల క్రితమే అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు హర్మూజ్ జల సంధిని తాత్కాలికంగా మూసివేసి క్షిపణి విన్యాసాలు నిర్వహించింది ఇరాన్. అంతర్జాతీయ వాణిజ్యానికి, చమురు రవాణాకు హర్మూజ్ జలమార్గం ఎంతో కీలకం. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ జలసంధిని మూసివేసే సామర్థ్యం తమకు ఉందని ఇప్పటికే అమెరికాకు సంకేతాలు పంపింది ఇరాన్. దీన్ని పూర్తిగా మూసివేయడంతో ఈ పోర్టుల నుంచి నౌకల రవాణ నిలిచిపోయింది. దీంతో చమురు ధరలు, ప్రపంచ సప్లయ్ చైన్ భారీగా ప్రభావితం కానుంది.
-
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసిన ఇరాన్
జలసంధిలో అన్ని నౌకలను నిలిపివేసిన ఇరాన్
హర్ముజ్ జలసంధి నుంచి 30శాతం ముడిచమురు రవాణా
ఇరాన్ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం
-
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి!
ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో రాన్ రక్షణ మంత్రి మృతి చెందినట్టు సమాచారం
రక్షణ మంత్రి అజీజ్ నాసీర్‌జాదే మృతి చెందినట్టు రాయిటర్స్ కథనం
ఇప్పటికే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందినట్టు పేర్కొన్న స్థానిక మీడియాలు
-
దుబాయ్ ఎయిర్‌పోర్టులో గందరగోళ వాతావరణం
ఎయిర్‌పోర్ట్ మూసివేత కారణంగా నిలిచిపోయిన విమానాల రాకపోకలు
దుబాయ్ నుంచి అనేక ప్రపంచ దేశాలకు నిలిచిన విమానాలు
దుబాయ్ హాల్ట్‌గా ఇతర దేశాలకు వెళ్లే విమానాలపై సైతం ప్రభావం
-
ప్రయాణికులకు DGCA కీలక సూచన
మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోలి-DGCA
ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు..
విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిరిండియా
-
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులతో మూతబడ్డ పశ్చిమాసియా ఎయిర్‌స్పేస్
ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతర్‌లో ఎయిర్‌స్పేస్ మూసివేత
దుబాయ్ నుంచి అన్ని విమాన సర్వీసులను నిలిపివేసిన ఎమిరేట్స్
దుబాయ్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దు.
-
దుబాయ్‌లో అన్ని ఎయిర్‌పోర్ట్‌ల మూసివేత
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేసినట్టు పేర్కొన్న దుబాయ్
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావొద్దని, వారి విమానాల షెడ్యూల్ గురించి ఎయిర్‌లైన్ ఆపరేటర్లతోనే టచ్‌లో ఉండాలని సూచన
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విమానాశ్రయం మూసివేసి ఉంటుందని వెల్లడి
-
అబుదాబిలోని హిందు ఆలయం మూసివేత
క్షిపణి దాడులు, ఉద్రిక్తతల నేపథ్యంలో అబుదాబిలోని హిందు ఆలయం మూసివేత
ఆలయాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించిన నిర్వాహక సంస్థ
-
అబుదాబి గగనతలంపై ఎయిర్ డిఫెన్స్ ఫైరింగ్
గల్ఫ్ దేశాలను, ఆ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్
ఇరాన్ క్షిపణి దాడులతో UAE సహా పలు గల్ఫ్ దేశాల్లో విమానయానంపై తీవ్ర ప్రభావం
-
మధ్య ఆసియా, పశ్చిమాసియాలో పరిస్థితులపై కేంద్ర పౌరవిమానయాన శాఖ సమీక్ష
సమీక్ష నిర్వహించిన పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేయడంతో అనేక దేశాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం
అనేక దేశాల గగనతలాలను మూసేస్తూ ఇప్పటికే ఆదేశాలు
ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రత, విమానాల దారి మళ్లింపు సహా వివిధ అంశాలపై సమీక్షించిన కేంద్ర మంత్రి
-
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థిని సెల్ఫీ వీడియో
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థిని సెల్ఫీ వీడియో
ఇరాన్ నుంచి తమను సురక్షితంగా వెనక్కి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి
‘Air strikes are happening, it is getting really worse for us’, Indian students in Iran pic.twitter.com/MuirSdblm3
— Sidhant Sibal (@sidhant) February 28, 2026
-
ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లో భారీ నష్టం
ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లో భారీ నష్టం జరిగింది. పలు బస్సులు మిస్సైల్ దాడిలో కాలిబూడిదయ్యాయి. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగింది. ఒకే బస్సు డిపోలో 28 బస్సులు క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి.
-
గల్ఫ్ యుద్ధంతో మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి
ఒక్క రోజే రూ.7 వేలు పెరిగిన 10 గ్రాముల బంగారం
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,68,710
రూ.6,550 పెరిగిన 22 క్యారెట్ల గోల్డ్ రేట్
రూ.1,54,650కు చేరిన 22 క్యారెట్ల బంగారం ధర
ఒక్కరోజే రూ. 25 వేలు పెరిగిన కిలో వెండి ధర
మరోసారి రూ.3 లక్షల మార్క్ దాటేసిన వెండి
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి రూ.3,20,000
-
కువైట్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు
భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
స్థానిక భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని సూచన
కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను ఫాలో అవ్వాలని సూచన
ఇండియన్ ఎంబసీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం
-
ఇరాన్‌పై యుఎస్-ఇజ్రాయెల్ దాడులను ఖండించిన పాకిస్థాన్
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను పాకిస్తాన్ ఖండించింది. తక్షణమే ఉద్రిక్తత తగ్గించాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాక పిలుపునిచ్చింది. శనివారం తన ఇరానియన్ సహచరుడితో జరిగిన ఫోన్ సంభాషణలో, ఇస్లామాబాద్ “ఇరాన్‌పై జరిగిన అనవసర దాడులను బలంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. పాకిస్తాన్ తక్షణమే ఉద్రిక్తతను ఆపి, అత్యవసరంగా దౌత్య సంబంధాలను పునఃప్రారంభించాలని పిలుపునిచ్చింది.
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు.. 36 మంది విద్యార్థులు మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు
మినాబ్‌లోని ఓ స్కూల్‌పై బాంబుల వర్షం
దాడిలో 36 మంది స్కూల్ విద్యార్థినులు మృతి
-
ఇజ్రాయెల్, అమెరికా దాడి.. ఇరాన్‌లో ఐదుగురు విద్యార్థినులు మృతి!
ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడుల్లో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లోని బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. ఈ యుద్ధం కారణంగా దేశంలో సంభవించిన తొలి మరణాలు ఇవే అని ఇరాన్ పేర్కొంది. స్థానిక మీడియాల ప్రకారం.. ఈ దాడి హార్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) బేస్ టార్గెట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఈ దాడిపై ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.
-
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామి మృతి!
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మేజర్ జనరల్ అమీర్ హతామి మరణించినట్లు స్థానిక మీడియా తెలిపాయి. అయితే ఈ విషయాన్ని ఇరాన్ అధికారులు లేదా ఇజ్రాయెల్ సైన్యం మాత్రం అధికారకంగా దృవీకరించలేదు.
-
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో రగులుతున్న పశ్చిమాసియా
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్
ఒకే సారి 8 దేశాలపై దాడులు చేసిన ఇరాన్
యూఏఈ, అబుదాబీలో భారీ పేలుళ్లు
అమెరికా బేస్ క్యాంప్‌లే లక్ష్యంగా ఇరాన్ దాడులు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో వెనుతిరిగిన పశ్చిమాసియాకు వెళ్తున్న ఇండిగో విమానం
పచ్చిమాసియాకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్‌లైన్స్
-
ఇరాన్ సుప్రీం లీడర్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమెనేయి టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టెహ్రాన్‌లోని ఖమెనేయి కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, కాంపౌండ్‌లకు సమీపంలో పలు క్షిపణి దాడులు జరిగాయి. ప్రకారం, ఖమెనేయి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇతర సీనియర్ సైనిక, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరినట్టు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ దాడులు విజయవంతం అయ్యాయో లేదో అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే ఇరాన్ మాత్రం ఖమెనేయి టెహ్రాన్‌లో లేరని, ఆయనను ఎప్పుడో సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు పేర్కొంది.
-
ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌పై బ్రిటన్ రియాక్షన్
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై చేస్తున్న సైనిక దాడులు నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో విస్తృత యుద్ధంగా మారిపోవచ్చని బ్రిటన్ ప్రభుత్వం శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతకు మంచిన దారుణ పరిస్థితులను తాము చూడాలనుకోవట్లేదని.. దీనికి త్వరగా ముగింపు పలకాలని బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే, ప్రాంతంలో ఉన్న తమ పౌరుల భద్రతను ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
-
ఒకేసారి 8 దేశాలపై మిస్సైళ్లు ప్రయోగించిన ఇరాన్
బహ్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీతో పాటు..
అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈపై ఇరాన్ దాడులు
-
ఇరాన్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు
ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తుందని కారణంతో క్షిపణుల దాడి చేసిన అమెరికా, ఇజ్రాయిల్
ఇరాన్ అధ్యక్షుడు అలీ హొస్సేనీ ఖమేనీ భవనంపై కూడా దాడులు చేసిన శత్రు దేశాలు
ప్రతీకారంగా ఇరాన్ ఖండాంతర క్షిపణలను ముందే పసిగట్టి కూల్చివేసిన ఇజ్రాయిల్
ఇరాన్, ఇజ్రాయిల్ గగనతలాన్ని మూసివేసిన ఇరుదేశాలు
ఇజ్రాయిల్, ఇరాన్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అడ్వైజర్ జారీ చేసిన భారత ప్రభుత్వం
స్థానిక ఎంబసీలను సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం
-
ఇంటర్నేషనల్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్
ప్రయాణికులకు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అడ్వైజర్ జారీ
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం
ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చేముందే సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచన
-
ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అనేక సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం కాసేపటి క్రితమే ప్రకటించింది. అలాగే ఇరాన్‌లోని ఇరాన్ పాలనకు చెందిన అనేక సైనిక లక్ష్యాలపై కూడా విస్తృత దాడి చేస్తున్నట్టు తెలిపింది.
-
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు
ఇరాన్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇజ్రాయెల్, అమెరికా
ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ భవనంపై దాడులు
ఇరాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేత
భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని..
అడ్వైజరీ జారీ చేసిన భారత ప్రభుత్వం
హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం
ఇరాన్‌లో నిలిచిపోయిన మొబైల్, ఇంటర్నెట్ సేవలు
-
దుబాయ్ లో మంచు విష్ణు..
దుబాయ్ పై ఇరాన్ మిస్సైళ్ళతో విరుచుకుపడుతోంది. అయితే ప్రస్తుతం తాను ఫ్యామిలీతో అక్కడే ఉన్నట్టు హీరో మంచు విష్ణు ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో ఓ మిస్సైల్ పైనుంచి దూసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే వీడియోలో విష్ణు ఫ్యామిలీ భయంతో ఉన్నట్టు చూడవచ్చు. శాంతి కోసం ప్రార్దిస్తున్నట్టు విష్ణు చెప్పారు.
-
గల్ప్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్
ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ పీఎం షరీఫ్ ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. అబుదాబీలో జరిగిన దాడుల్లో పాకిస్తాన్ పౌరుడు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
-
ట్రంప్ కు ఇరాన్ బిగ్ వార్నింగ్
యుద్ధం నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు మా వద్ద ఉన్న పాత ఆయుధాలనే ఉపయోగించాం. త్వరలో మేము వాడే వెపన్స్ నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు అని హెచ్చరించింది.
-
ఎయిర్ పోర్టులో చిక్కుకున్న భారత ప్లేయర్స్
ఐరన్ దాడుల నేపధ్యంలో పలు గల్ఫ్ దేశాల ఎయిర్ పోర్టులలో భారత ఆటగాళ్లు చిక్కుకున్నారు. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు చిక్కుకోగా.. ఖతర్ లోని దోహా ఎయిర్ పోర్టులో భారత బాస్కెట్ బాల్ టీం ఇరుక్కుపోయింది. సింధు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ఆడేందుకు బర్మింగ్ హామ్ వెళ్లాల్సి ఉండగా.. ఖతర్ లో 2027 ప్రపంచకప్ కోసం ఫిబ్రవరి 27న క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడిన భారత బాస్కెట్ బాల్ టీం భారత్ తిరిగి రావాల్సి ఉంది.
Published On - Feb 28,2026 3:04 PM




