AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు

టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు

Phani CH
|

Updated on: May 25, 2026 | 4:57 PM

Share

అమెరికాలో టెక్ కంపెనీల లేఆఫ్స్ భారతీయ H-1B ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త స్పాన్సర్‌ను కనుగొనడానికి కేవలం 60 రోజుల గడువే ఉండటంతో చాలామంది భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. తాత్కాలికంగా B-2 విజిటర్ వీసాకు మారాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్ల కొనుగోలు, పిల్లల చదువులు వంటి దీర్ఘకాల ప్రణాళికలు ఒక్కసారిగా సంక్షోభంలో పడుతున్నాయి.

అమెరికాలో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా AI పై పెట్టుబడులు పెంచింది. దాదాపు 8వేల ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా టీమ్స్ సైజ్‌ తగ్గిస్తోంది. లింక్డ్‌ఇన్ సైతం ఉద్యోగులపై వేటు వేసింది లే ఆఫ్స్‌తో అమెరికాలో నివాసం ఉండటం కష్టమనే భయం భారతీయుల్లో పెరుగుతోంది. చాలా మంది నిపుణులు H-1B వీసాలపై ఇంతకాలం పనిచేసారు. వీసా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరో యజమానిని వెతుక్కోవడానికి వారికి 60 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. విఫలమైతే, దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లే ఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మందికి అమెరికాలో పుట్టిన పిల్లలు ఉన్నారు. దీర్ఘకాలం అక్కడే ఉంటామనే నమ్మకంతో సొంతంగా ఇళ్లు కొన్నారు. ఉద్యోగం పోవడంతో ఆ ప్లాన్లన్నీ రాత్రికి రాత్రే అనిశ్చితిలోకి వెళ్లిపోతున్నాయి. అమెరికాలో కొనసాగడానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాలను వెతుక్కోక తప్పని పరిస్థితి. దీనికి B-2 విజిటర్ వీసాకు మారడమే పరిష్కారం. తద్వారా మరో ఉద్యోగం వెతుక్కునే లోపు అక్కడ మరికొన్ని నెలలు ఉండే అవకాశం లభిస్తుంది. యుఎస్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన H-1B కార్మికులకు కొత్త ఉద్యోగం చూసుకోవడానికి సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ లేదా వారి I-94 హోదా గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది లభిస్తుంది. ఆ సమయంలో తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వేరే యజమానిని వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఆ 60 రోజుల గడువు సాధారణంగా ఉద్యోగి చివరి పని దినం నుంచి ప్రారంభమవుతుంది, అంతేకానీ చివరి జీతం బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటి నుండి కాదు అనేది గుర్తించాలి. వాస్తవానికి, టెక్ పరిశ్రమలో నియామకాలు మందగించినప్పుడు రెండు నెలల సమయంలో కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం, ఉద్యోగం రావడం, వీసా ట్రాన్స్‌ఫర్‌ చేయించడం అంత ఈజీకాదు. అందుకే ఉద్యోగాలు కోల్పోయిన వారు Form I-539 దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B-1 లేదా B-2 విజిటర్ వీసాకు మారాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా పదివేల మందికి పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. వారంతా తమ ‘అమెరికన్ డ్రీమ్’ ఆశలను వదిలేసుకుంటున్న పరిస్థితి. వారిలో సగం మంది ఇండియాకు తిరిగిరావాలనుకుంటే మరి కొందరు కెనడా , యూరప్ వైపు చూస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు

ర్యాట్‌ స్నాకింగ్‌… ఇదో వింత అలవాటు..! కానీ చాలా డేంజర్!

పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌ ఎందుకు చనిపోతుంది? నమ్మలేని నిజాలు..

‘ఫ్రెంచ్ సండే’ ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

అద్భుతాన్ని కనిపెట్టి.. సీక్రెట్‌ మెయిన్‌టైన్ చేసిన ఇస్రో!

Follow Us