పెద్ది vs డ్రాగన్.. తారక్-చరణ్ ఫ్యాన్స్ మధ్య సైలెంట్ వార్ స్టార్ట్!
పెద్ది ట్రైలర్, డ్రాగన్ టీజర్ విడుదలతో సోషల్ మీడియాలో తారక్-చరణ్ అభిమానుల మధ్య సైలెంట్ వార్ మొదలైంది. రెండు సినిమాల్లో హీరోల మేకోవర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డ్రాగన్‌లో ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌గా కనిపిస్తుండగా.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే ట్రాన్స్‌ఫర్మేషన్‌తో మెప్పిస్తున్నారు. రెండు సినిమాల కంటెంట్, విజువల్స్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ముందు నుంచి అనుకున్నదే.. ఒకేసారి రెండు పెద్ద సినిమాల టీజర్, ట్రైలర్ వచ్చినపుడు కచ్చితంగా వద్దన్నా పోలిక ఉంటుంది. రెండు డిఫెరెంట్ జోనర్స్ అయినా కూడా ఎవరికి వాళ్లు తమ హీరోనే గొప్ప అని చెప్పుకునే ఓ ప్రయత్నమైతే చేస్తారు. తాజాగా పెద్ది, డ్రాగన్ విషయంలో ఇదే జరుగుతుందా..? తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సైలెంట్ రచ్చ మొదలైందా..? రామ్ చరణ్, ఎన్టీఆర్ బయట కూడా ఇలాగే హాయిగా దోస్తీ అంటారు కానీ అభిమానులే అప్పుడప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. తాజాగా రెండు రోజుల గ్యాప్‌లోనే ఇటు పెద్ది ట్రైలర్.. అటు డ్రాగన్ టీజర్ విడుదలయ్యాయి. ఏ మాటకామాటే ఈ రెండింట్లోనూ హీరోల మేకోవర్స్ మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. ఎవరికి వాళ్లు తగ్గేదే లే అన్నట్లు ప్రాణం పెట్టారు. డ్రాగన్ కోసం తారక్ మేకోవర్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. మొహంలో కళ పోయిందనే విమర్శలు వస్తున్నా.. లుక్ చూసి పడిన కష్టాన్ని గుర్తిస్తున్నారు. గ్లింప్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ మురిసిపోతున్నారు. మరోవైపు పెద్ది కోసం చరణ్ కూడా ఇదే స్థాయిలో ఒళ్ళు హూనం చేసుకున్నారు. క్రికెటర్, రెజ్లర్, కుస్తీ అంటూ బాగా మేకోవర్ అయిపోయారు. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా తారక్ వర్సెస్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పోటీ అయితే కనిపిస్తుంది. మరీ విమర్శలు చేసుకోవట్లేదు కానీ డిబేట్ అయితే నడుస్తుంది. రెండు సినిమాల్లో ఏది బెస్ట్.. ఎవరి మేకోవర్ ఎలా ఉంది అనే డిస్కషన్స్ అయితే డీప్‌గానే నడుస్తున్నాయి. పెద్ది స్పోర్ట్స్ డ్రామా అయితే.. డ్రాగన్ ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో వస్తుంది. ఫ్యాన్స్ పోటీ ఎలా ఉన్నా.. ఇటు పెద్ది, అటు డ్రాగన్ రెండూ ఆయా హీరోల కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. వీటికోసం సింపుల్‌గా చెప్పాలంటే ప్రాణం పెట్టారు రామ్ చరణ్, ఎన్టీఆర్. చూస్తుంటే కంటెంట్ పరంగానూ టాప్ నాచ్‌లోనే ఉన్నాయి. మరి చూడాలిక.. వీటి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు
కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..

