కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే
మచిలీపట్నంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగ యువతిని వేధించిన లెక్చరర్‌ను అతని భార్య హ్యూమన్ రైట్స్ సభ్యులతో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో దాడి చేసి బహిరంగంగా నిలదీసింది. గతంలోనూ ఉద్యోగాల పేరుతో పలువురు అమ్మాయిలను మోసం చేశాడని ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో ఓ నిరుద్యోగ యువతిని లోబరుచుకోవడానికి ప్రయత్నించిన కామాంధుడైన భర్తకు, ఓ భార్య బడితపూజ చేసిన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది. దారి తప్పిన భర్త లీలలను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సహకారంతో సదరు భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, నడిరోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడు జాషువా గతంలో మచిలీపట్నంలోని ఒక మహిళా కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఇటీవల అతనికి అవనిగడ్డ గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. అయితే, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో భార్య కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఓ నిరుద్యోగ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన జాషువా, ఆమెను తన రూమ్‌కి రావాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అతని భార్య, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో కలిసి పథకం ప్రకారం నిందితుడి రూమ్‌పై ఎటాక్ చేసింది. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న జాషువాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. గతంలోనూ జాషువా ఉద్యోగాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని, అతని కీచక చేష్టల వల్లే కాపురం ముక్కలైందని భార్య కన్నీరు మున్నీరైంది. ఎన్నివిధాల చెప్పినా బుద్ధి మార్చుకోకుండా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా
టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
ర్యాట్ స్నాకింగ్… ఇదో వింత అలవాటు..! కానీ చాలా డేంజర్!
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది? నమ్మలేని నిజాలు..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

