తెలుగు మీడియాలో 22 సంవత్సరాల అనుభవం ఉంది. మొదటగా మూవీ మార్కెట్ మ్యాగజైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేను.. అనంతరం జీ తెలుగు, ఎన్టీవీ సంస్థలలో సినిమా ఇన్చార్జిగా పని చేసాను. ప్రస్తుతం టీవీ9 సంస్థలో ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని శాఖలపై ఉన్న అవగాహన మేరకు నా వార్తలు ఇక్కడ ప్రచురిస్తున్నా..
Dasara 2026: దసరా బరిలో రెండు క్రేజీ ప్రాజెక్టుల ఫైట్
ఈ దసరాకు బాక్సాఫీస్ పోటీ ప్రధానంగా రజినీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాల మధ్య ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రంపై భారీ అంచనాలుండగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ‘రణబాలి’ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ధనుష్ నటిస్తున్న ‘ఓం’ సినిమా వాయిదా పడటంతో ఈ రెండు చిత్రాల పోటీపై సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 9, 2026
- 6:04 pm
హిట్స్ కోసం హీరోల సొంత డైరెక్షన్..
టాలీవుడ్లో కొందరు హీరోలు నటనకే పరిమితం కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’తో మధ్యతరగతి భావోద్వేగాలను చూపించేందుకు సిద్ధమవుతుండగా, రామ్ పోతినేని ‘నియో నాయిర్’ శైలిలో క్రైమ్, సస్పెన్స్ కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కార్తికేయ బాక్సింగ్ నేపథ్యంలో ‘కమ్‌బ్యాక్’ స్పోర్ట్స్ డ్రామాతో రానుండగా, సుధీర్ బాబు మార్షల్ ఆర్ట్స్ కథతో దర్శకుడిగా మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 9, 2026
- 6:01 pm
Chakkora Review: చకోర సినిమా రివ్యూ.. పూరీ జగన్నాథ్ శిష్యుడి సినిమా మెప్పించిందా..?
ఆదర్శ కుటుంబం వాయిదాతో ఈ వారం అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. అలా వచ్చిన సినిమానే చకోరా. స్వచ్ఛమైన వర్షపు నీటి కోసం ఎన్నాళ్లైనా వేచి చూసే చకోర పక్షి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు, పూరీ జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్.. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 9, 2026
- 3:23 pm
Mayookha Review: ‘మయూఖ’ సినిమా రివ్యూ.. ఇంటర్నేషనల్ అవార్డులు గెలిచిన సినిమా మెప్పించిందా..?
రిలీజ్‌కు ముందే 'న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్' వేదికపై ఉత్తమ మిస్టరీ చిత్రంగా అవార్డు అందుకుని అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసిన సినిమా మయూఖ. సస్పెన్స్ జోనర్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? విడుదల తర్వాత ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూద్దాం..
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 9, 2026
- 2:21 pm
Hanuman Ansh: హనుమాన్ అంశ్ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం మెప్పించిందా..?
గత 50 రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న హనుమాన్ అంశ్ సినిమా తెలుగులో విడుదలైంది. 2 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఎలా ఉంది..? అసలంతగా ఈ సినిమాలో ఏముందో పూర్తి రివ్యూలో చూద్దాం ..
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 9, 2026
- 2:13 pm
Comrade Kalyan Review: కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ.. నక్సలైట్ గా శ్రీ విష్ణు మెప్పించాడా..?
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన సినిమా కామ్రేడ్ కల్యాణ్. ఇందులో మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. డైరెక్టర్ జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 9న అడియన్స్ ముందుకు వచ్చింది.ే నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మీరు పిలిచిందో చూద్దాం..
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 9, 2026
- 8:39 am
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా
అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా వాయిదా పడింది. ఫస్ట్ కాపీ, ట్రైలర్ ఇంకా సిద్ధం కాలేదని నిర్మాత నాగవంశీ తెలిపారు. అనుకున్న తేదీ కోసం నాణ్యత తగ్గించి సినిమాను విడుదల చేయడం ఇష్టం లేదని, మరో రెండు మూడు వారాల సమయం తీసుకుని పర్ఫెక్ట్ ఔట్పుట్తో వస్తామని చెప్పారు. అక్టోబర్ 30న విడుదల చేస్తే అదే రోజున వచ్చే ఇతర సినిమాలతో బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 7, 2026
- 10:28 pm
‘అఖండ 2’ తర్వాత బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
‘అఖండ 2’ తర్వాత బోయపాటి శ్రీను నెక్ట్స్ మూవీపై ఆసక్తి నెలకొంది. బాలకృష్ణతో ‘అఖండ 3’ ఉంటుందని ఆయన చెప్పినా, బాలయ్య బిజీ లైనప్ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు గీతా ఆర్ట్స్ నుంచి బోయపాటికి ఆఫర్ ఉన్నట్లు, తమిళ హీరో సూర్యతో యాక్షన్ డ్రామాపై చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో బాలయ్య కోసం వేచి ఉంటారా? లేక మరో హీరోతో ముందుకెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 7, 2026
- 10:26 pm
Prabhas: డార్లింగ్ బర్త్‌డే మీద అభిమానుల ఆశలు.. సలార్ 2 అప్డేట్ ఉంటుందా..?
ప్రభాస్ బర్త్‌డే మంత్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో సందడి మొదలైంది. అక్టోబర్ 23న ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ‘ఫౌజీ’ నుంచి టీజర్, ‘స్పిరిట్’ నుంచి ప్రభాస్ పోలీస్ లుక్, ‘కల్కి 2’పై ప్రత్యేక ప్రకటనతో పాటు ‘సలార్ 2’ షూటింగ్‌పై క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 7, 2026
- 10:22 pm
Kriti Shetty: డ్రీమ్ రోల్ ఏంటో రివీల్ చేసిన కృతి శెట్టి
‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకెళ్లిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస పరాజయాలతో కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగు సినిమాలకు దూరంగా ఇతర భాషల్లోనూ ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ప్రస్తుతం మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కృతి.. తన డ్రీమ్ రోల్స్‌ను వెల్లడించారు. ప్రిన్సెస్, వారియర్ వంటి పవర్ఫుల్ పాత్రలు చేయాలనుందని చెప్పినట్లు సమాచారం.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 7, 2026
- 10:20 pm
Bhagyashri Borse: తొలి బ్లాక్‌బస్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే దశ తిరిగింది.. బిగ్ ఛాన్స్ కొట్టిన ముద్దుగుమ్మ
‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌కు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే.. ‘లెనిన్’తో కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఈ సక్సెస్‌తో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే, మోహన్‌లాల్ సరసన ‘ఆపరేషన్ గంగ’తో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ మూవీ అప్డేట్స్, వెకేషన్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 7, 2026
- 10:19 pm
Drishyam 3: సౌత్‌లో నిరాశపరిచిన దృశ్యం 3.. నార్త్‌లో బ్లాక్ బస్టర్
‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మూడో భాగం సౌత్, హిందీ వెర్షన్లకు భిన్నమైన స్పందన వస్తున్నట్లు కథనం చెబుతోంది. సౌత్ వెర్షన్ రొటీన్ ట్విస్టులు, సాగదీత స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని టాక్ ఉండగా, అజయ్ దేవగన్ నటించిన హిందీ వెర్షన్ మాత్రం మంచి స్పందనతో దూసుకెళ్తున్నట్లు పేర్కొంది. హిందీ నేటివిటీకి తగ్గ మార్పులు, ఫ్యామిలీ ఎమోషన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని కథనం చెబుతోంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Oct 7, 2026
- 10:17 pm