AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నాని ఏంటయ్యా నీ రేంజ్.. ఆ క్రేజ్ చూసి చాలా మంది హీరోలకు నిద్ర పట్టదేమో..?

దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమాలన్నీ దాదాపు వంద కోట్ల కలెక్షన్లు రాబట్టినవే. ఇప్పుడివే కాదు టాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టేసేందుకు ది ప్యారడైజ్ సినిమాతో మన ముందుకు రానున్నాడు నాని.

Nani: నాని ఏంటయ్యా నీ రేంజ్.. ఆ క్రేజ్ చూసి చాలా మంది హీరోలకు నిద్ర పట్టదేమో..?
The Paradise Movie Actor Nani
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 8:45 AM

Share

ఇండస్ట్రీలో ఒక హీరో రేంజ్ ఏంటో.. బాక్సాఫీస్ దగ్గర అతని స్టామినా ఏంటో కొలవడానికి చాలా లెక్కలు ఉంటాయి. కానీ ఒక హీరో పుట్టినరోజుకి ఎంతమంది నిర్మాతలు స్వయంగా ఇంటికి వచ్చి బొకేలు ఇచ్చి విష్ చేస్తున్నారనేది కూడా ఆయన క్రేజ్‌కి ఒక పర్ఫెక్ట్ కొలమానం. ఈరోజు నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 30 మంది అగ్ర నిర్మాతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పడం చూస్తుంటే ఇండస్ట్రీలో ఆయన స్థాయి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. నాని ఇప్పుడు కేవలం ఒక హీరో కాదు, ఇండస్ట్రీకి మోస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న స్టార్ అని ఈ సంఘటన ప్రూవ్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పటివరకు నానిలో మనం కేవలం ఒక అద్భుతమైన పెర్ఫార్మర్‌ని మాత్రమే చూశాం. కానీ ఈసారి అందులోని అదిరిపోయే డాన్సర్‌ని కూడా చూడబోతున్నాం. ఆయన సిగ్నేచర్ స్టెప్పులు వేస్తుంటే స్క్రీన్ మీద చూడటానికి చాలా కొత్తగా, ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది.

ముఖ్యంగా ఆ రెండు జడల లుక్, అందులో ఆయన చూపిస్తున్న గ్రేస్, ఆ స్వాగ్ చూస్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. తనలోని కొత్త యాంగిల్‌ను బయటపెడుతూ నాని చేస్తున్న ఈ ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కొత్త పాటతో తన అభిమానులకు నాని సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చేశాడనే చెప్పాలి. ఆ స్టెప్పులు, ఆ మాస్ వైబ్ ఎలా ఉందంటే.. ప్యారడైజ్‌కి వెళ్లి డబుల్ మసాలాతో ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ లాగించినంత కిక్ ఇస్తోంది. ఇది పక్కా మాస్ ఆడియన్స్‌కు పైసా వసూల్ మీల్స్ లాంటి ఫీలింగ్. నాని డాన్స్‌లో ఇంత ఎనర్జీ, ఇంత గ్రేస్ దాగి ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఈ సాంగ్ డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది.

ఇది పక్కన పెడితే.. సోషల్ మీడియాలో నాని లైనప్‌లో ఉన్న రెండు కొత్త సినిమాల మీద జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్ట్స్ గురించిన చర్చే నడుస్తోంది. నాని కథల ఎంపికలో చూపిస్తున్న వైవిధ్యం, అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ స్కేల్ చూసి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవరాల్‌గా నాని కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే.. ఇప్పటిదాకా ఆయన వేసిన అడుగులు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో వేయబోతున్న అడుగులు మరో ఎత్తు అని చెప్పొచ్చు. తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటున్న తీరు, ఎంచుకుంటున్న పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ చూస్తుంటే నాని రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పుట్టినరోజు ఆయన జర్నీలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోవడం పక్కా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us