AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని ప్యారడైజ్‌లో హుక్ స్టెప్ కాపీ.. ఒరిజినల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవలే కోర్ట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోగా నాని ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .

నాని ప్యారడైజ్‌లో హుక్ స్టెప్ కాపీ.. ఒరిజినల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్
Nani
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2026 | 9:10 AM

Share

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో నాని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ బజ్ నెలకొంది. నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో పాటు యాక్షన్ మోడ్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ప్యారడైజ్ సినిమా నుంచి ఆయా షేర్ అనే సాంగ్ ను విడుదల చేశారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సాంగ్ ని విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఎక్కడ చూసిన ఈ సాంగే  వినిపిస్తుంది. అలాగే ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నాని ఈ సాంగ్ లో డాన్స్ అదరగొట్టాడు. ముఖ్యంగా హుక్ స్టెప్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ హుక్ స్టెప్ ను కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ యూట్యూబర్ మాత్రం ఇందులో నాని వేసిన హుక్ స్టెప్ నాదే అని, కాపీ కొట్టేశారని అంటున్నాడు. బాబా జాక్సన్ పేరుతో ఉన్న ఓ ఇన్ఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. డిఫరెంట్ డాన్స్ మూవీస్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. గతంలో ఓ ఫారెనర్ తో కలిసి ఈ డాన్స్స్ స్టెప్ వేశాడు. అదే స్టెప్ ను ఇప్పుడు నాని ప్యారడైజ్ సినిమాలో కాపీ చేశారని అంటున్నారు. కొంతమంది నెటిజన్స్ ఆ రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి ఒరిజినల్, కాపీ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
Horoscope Today: 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today: 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు