AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెమ్యునరేషన్ లో కుర్ర హీరోల దూకుడు

రెమ్యునరేషన్ లో కుర్ర హీరోల దూకుడు

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 7:21 PM

Share

టాలీవుడ్ కుర్ర హీరోల రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్. కిరణ్ అబ్బవరం, తేజ సజ్జా, నాని, విజయ్ దేవరకొండ వంటి యువ స్టార్లు భారీగా పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లలో వసూలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారి మార్కెట్ విలువ ఎలా పెరిగిందో, వారు ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారో ఈ కథనంలో చూద్దాం. ఈ యువ హీరోల అధిక రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

రెమ్యునరేషన్‌లో తగ్గేదే లే అంటున్నారు కుర్ర హీరోలు. ఏంటి వీళ్ళకు ఇంత ఇస్తున్నారా అని నోరెళ్లబెట్టేలా వసూలు చేస్తున్నారు కొందరు కుర్రాళ్లు. వాళ్ల రేట్ చూసాక.. వామ్మో రేంజ్ బాగానే పెరిగింది అంటూ షాక్ అవ్వడం చూసేవాళ్ల వంతవుతుంది. మరి అంతగా రెమ్యునరేషన్స్‌తో రచ్చ చేస్తున్న ఆ హీరోలెవరో చూద్దామా..? కిరణ్ అబ్బవరం ఓ సినిమా కోసం 12 కోట్లు తీసుకుంటున్నాడంట.. టాలీవుడ్‌లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. క, కే ర్యాంప్ లాంటి సినిమాల తర్వాత కిరణ్ రేంజ్ బాగానే పెరిగిందనడానికి ఈ పారితోషికమే ఎగ్జాంపుల్. బడా నిర్మాణ సంస్థతో 12 కోట్లకు సినిమా సైన్ చేసారు కిరణ్. ప్రస్తుతం ఈయన చెన్నై లవ్ స్టోరీతో పాటు.. ఓ వెబ్ సిరీస్, 2 సినిమాలు చేస్తున్నారు. కిరణ్ ఒక్కరే కాదు.. ఇతర కుర్ర హీరోల రేంజ్ అలాగే ఉంది. హనుమాన్, మిరాయ్ లాంటి సినిమాల తర్వాత తేజ సజ్జాతో సినిమా చేయడానికి 20 కోట్లైనా ఇచ్చేందుకు సిద్ధమే అంటున్నారు నిర్మాతలు. మనోడి రేంజ్ కూడా ఆ రేంజ్‌లోనే ఉందిప్పుడు. తప్పు లేదు.. తేజకు ఇవ్వొచ్చు అంటున్నారు నిర్మాతలు కూడా. హనుమాన్‌తో 300.. మిరాయ్‌తో 150 కోట్లు కొట్టారు తేజ సజ్జా. నాని రేంజ్ చెప్పాల్సిన పనేలేదు.. ఈయన రేంజ్ 40 కోట్లు కాదు అంతకు మించే ఉంది. రెమ్యునరేషన్‌తో పాటు షేర్ కూడా తీసుకుంటున్నారు నాని. ఈ లెక్కన ఆయన రేంజ్ 50 కోట్లకు చేరిపోయింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సైతం ఫ్లాపుల్లో ఉన్నా.. సినిమాకు 20 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. మొత్తానికి స్టార్ హీరోలే కాదు.. తర్వాతి బెంచ్ కూడా బలంగానే ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

Follow Us