AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Phani CH
|

Updated on: Feb 25, 2026 | 7:17 PM

Share

సోషల్ మీడియా ట్రోల్స్, నెగిటివిటీపై నటి సమంత గట్టిగా స్పందించారు. అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా, తన డిజిటల్ స్పేస్‌ను ఇంటిలా శుభ్రంగా ఉంచుకుంటానని, కావాలని దుష్ప్రచారం చేస్తే సహించబోనని సమంత హెచ్చరించారు. తనను బ్లాక్ చేస్తే అది బాధపడినట్లు కాదని, తన ప్రపంచంలో వారికి స్థానం లేదని అర్థమని స్పష్టం చేశారు. ట్రోలర్స్‌కు అస్సలు మినహాయింపు ఉండదని తేల్చి చెప్పారు.

సమంత పైకి కనిపించేంత సాఫ్ఠ్ అయితే కాదు.. తన జోలికొస్తే ఇవ్వాల్సింది వెంటనే ఇచ్చేస్తుంటారు ఈమె. అది పొగడ్తలైనా.. విమర్శలైనా.. బాకీ ఉంచుకోరు. తాజాగా మరోసారి ఇదే జరిగింది. ఈసారి ట్రోలర్స్‌కు ఇంకాస్త పెద్ద వార్నింగే ఇచ్చారు స్యామ్. అసలు ఈమెకు వచ్చిన సమస్యేంటి.. ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యారు..? సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు సమంత. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే యాక్షన్ డ్రామా చేస్తున్నారు స్యామ్. మే 15న విడుదల కానుంది ఈ చిత్రం. సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండటం సమంత అలవాటు. తాజాగా తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టా వేదికగా ముచ్చటించిన స్యామ్.. చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్‌తో పాటు హెల్త్‌పై వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌ను ఎలా ఎదుర్కొంటారని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు.. గట్టి ఆన్సరే ఇచ్చారు సమంత. ప్రశంసలతో తాను పొంగిపోనని.. అలాగే విమర్శ తనపై ఏ ప్రభావం చూపించదని తెలిపారు. కానీ తన డిజిటల్ స్పేస్‌లోకి వచ్చి ఎవరైనా కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే మాత్రం ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటి లాగే సోషల్ మీడియా పేజీని కూడా శుభ్రంగా ఉంచుకుంటానన్నారు సమంత. తానెవర్నైనా బ్లాక్ చేశానంటే దాని అర్థం తనను బాధపెట్టినట్లు కాదని.. తన ప్రపంచంలో వాళ్లు అవసరం లేదన్నట్లు అని తెలిపారు స్యామ్. ట్రోల్స్ విషయంలో అస్సలు ఊపేక్షించే సమస్యే లేదన్నారు ఈ బ్యూటీ. మొత్తానికి తనను టార్గెట్ చేసే వాళ్లపై క్లియర్‌గానే ఉన్నారు స్యామ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ

Published on: Feb 25, 2026 07:17 PM
Follow Us