సమంత రుత్ ప్రభు

సమంత రుత్ ప్రభు

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన భారతీయ నటి సమంత రూత్ ప్రభు. మోడలింగ్‌తో కెరీర్ మొదలు పెట్టిన సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో అగ్రనటిగా ఎదిగిపోయింది సమంత. 2017లో అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్యను ప్రేమవివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా సమంత నటనను కొనసాగించారు. వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్‌లో ఇద్దరూ విడిపోతున్నట్లు వారు సోషల్ మీడియా ద్వారా వారు ప్రకటించారు. విడాకుల తర్వాత కూడా ప్రతి ఏటా ఒకట్రెండు మూవీస్‌లో సమంత నటిస్తున్నారు. ఏ మాయ చేశావే మూవీలో నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు, ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో నటనకు ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకున్నారు. అత్తారింటికి దారేది మూవీకి ఉత్తమ నటి (2013), ఓ బేబి మూవీకి ఉత్తమ నటి (2019) గా సైమా అవార్డులు గెలుచుకున్నారు.

ఇంకా చదవండి

Samantha: మరో అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్‌లో ఆందోళన

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. మయోసైటిస్ బారిన పడడం, తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళుతుండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సామ్.

ఇదేందయ్యా ఇది..! నాగ చైతన్య, సమంత, శోభిత కలిసి ఒకే సినిమాలో నటించారా.?

అక్కినేని అందగాడు నాగ చైత్యన వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నాగ చైతన్య. చైతన్య కెరీర్‌లో మంచి హిట్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తండేల్ సినిమాతో రానున్నాడు చై.

Ram Charan: సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్.. ఆ ప్రశ్నతో ఇరికించిన బాలయ్య…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు, ఈవెంట్లలో పాల్గొంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే అన్‏స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

Samantha: సినిమాలు చేయకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సామ్

సమంతకు బాలీవుడ్ నీళ్లు బాగా ఒంట బట్టేసాయి. అక్కడికి వెళ్లిన తర్వాత అమ్మడిలో చాలా మార్పులే వచ్చాయి. ఆ మధ్య ఫ్యామిలీ మ్యాన్‌తోనే టీజర్ చూపించిన ఈ బ్యూటీ.. సిటాడెల్‌తో ఫుల్ సినిమా చూపించారు. సోషల్ మీడియా అంతా సమంత జపమే నడుస్తుందిప్పుడు. సినిమాలు చేయకుండా స్యామ్ ట్రెండ్ అవ్వడానికి కారణమేంటి..?

Heroines: తెలుగులో క్రేజ్ పీక్స్.. హీరోయిన్లు చూపులు మాత్రం బాలీవుడ్‌పై.. కారణమేంటి.?

తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత క్రేజ్ ఉంది.. నెత్తిన పెట్టుకుని చూసుకునే నిర్మాతలున్నారు.. అడక్కుండానే కారెక్టర్స్ రాసే దర్శకులున్నారు.. కానీ మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్‌పైనే ఉన్నాయి. నార్త్ అంతా మన జపం చేస్తుంటే.. హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ బాట ఎందుకు పడుతున్నారు..? దానికి కారణమేంటి..?

TOP 9 ET: దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి ఒడిగడుతున్నార్రా..

గేమ్ ఛేంజర్ సినిమాను జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్నా.. మేకర్ నుంచి వైరల్ అయ్యే.. అప్డేట్స్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అలా సీరియస్ అయిన ఓ ఫ్యాన్‌.. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌ను బెదిరించాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను వెంటనే విడుదల చేయాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

Keerthy Suresh: సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే

బేబీ జాన్ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గాబితో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు డిసెంబర్ 25న విడుదలయ్యింది. తమిళ్ లో మంచి విజయం సాధించిన తేరి సినిమాకు రీమేక్ గా బేబీ జాన్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు అట్లీ నిర్మాతగా మారి సినిమా రూపొందించారు.

Prabhas: మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల్లో ప్రభాస్ టాప్.. తర్వాత ఆ తెలుగు స్టార్ హీరోయిన్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కల్కి సినిమాతో థియేటర్లలోకి వచ్చిన డార్లింగ్.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Samantha-Rana: ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ పోస్ట్‌..

ఈరోజు నటుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి సమంత రానాకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. సామ్ తన ఇన్‌స్టాలో రానాకు విషెష్ చెబుతూ పోస్ట్ పెట్టారు. ‘‘హ్యాపీ బర్త్‌డే డియర్‌ రానా. మీరు ప్రతి పనిలోను 100శాతం శ్రమిస్తారు.

Samantha: సమంతాకి కాబోయే భర్త ఎవరు ?? వైరల్ అవుతున్న సామ్ పోస్ట్

కొందరు హీరోయిన్లు ఏం మాట్లాడినా సంచలనమే. కొన్నిసార్లు వాళ్ల మౌనం కూడా ఏదో చెప్పినట్లే ఉంటుంది. అలాంటి వాళ్లలో సమంత అందరికంటే ముందుంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. అందులో కాబోయే వాడు, పిల్లలు అంటూ చాలా మ్యాటర్ ఉంది. మరి ఆమె ఏం పోస్ట్ చేసారు..? దాని వెనక కథేంటి..?

  • Phani CH
  • Updated on: Dec 12, 2024
  • 9:38 pm