Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా అప్‌డేట్‌లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ పవర్‌ఫుల్ లుక్స్ విడుదలయ్యాయి. ప్రభాస్ తన మిగతా ప్రాజెక్టులు పూర్తి చేస్తుండగా, సందీప్ 'స్పిరిట్' కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం మార్చి 5, 2027న విడుదల కానుంది.
స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్‌గా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలా..? ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అయితే ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ సందీప్ రెడ్డి వంగా ఒకే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. తాజాగా అలాంటి సర్‌ప్రైజ్ మరోటి ఇచ్చారు. మరి ప్రభాస్ కోసం సందీప్ తన స్టైల్ మార్చారా.. లేదంటే సందీప్ కోసం ప్రభాసే రూట్ మార్చేసారా చూద్దామా..? సందీప్ వంగా ఫోకస్ అంతా ఇప్పుడు స్పిరిట్ సినిమాపైనే ఉంది కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్ ఆడియోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన సందీప్.. ప్రభాస్ బర్త్ డే లుక్‌తో మరోసారి మాయ చేసారు. ఇప్పుడు సడన్‌గా వివేక్ ఒబేరాయ్ లుక్ వదిలి అందరికీ షాక్ ఇచ్చారు వంగా. నోట్లో సిగార్, చేతిలో కర్ర పట్టుకుని పవర్‌ఫుల్‌గా ఉన్నారు వివేక్. వివేక్ లుక్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. వివేక్ ఒబేరాయ్‌తో పాటు మరో లుక్ కూడా విడుదల చేసారు సందీప్. ఇదే ఫోటోలో కింద ఐశ్వర్యా దేశాయ్ లుక్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. గల్లీ బాయ్ సినిమాతో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. సందీప్ స్పిరిట్‌పై ఫోకస్ చేస్తే.. ప్రభాస్ మాత్రం ఫౌజీతో పాటు అటు కల్కి 2 బ్యాలెన్స్ పూర్తి చేస్తున్నారు. స్పిరిట్ కోసం బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. మిగతా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేంత వరకైనా ఆగుతాను కానీ.. తన సినిమా చేస్తున్నపుడు మరో సెట్‌లోకి వెళ్లొద్దనేది సందీప్ వంగా కండీషన్. అందుకే మిగిలిన సినిమాలను త్వరగా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ఈలోపు మిగిలిన వర్క్ పూర్తి చేస్తున్నారు సందీప్ వంగా. 2027, మార్చి 5 విడుదల కానుంది స్పిరిట్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!
Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

