AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

Phani CH
|

Updated on: Mar 01, 2026 | 9:57 PM

Share

సినిమా విజువల్స్ అద్భుతంగా ఉంటే ప్రేక్షకులు AI వాడేశారని భావిస్తున్నారు. దీంతో దర్శకులు రాజమౌళి, నెల్సన్, నటుడు నిఖిల్ వంటి మేకర్స్‌కు AI టెన్షన్ మొదలైంది. ఇది AI కాదు, తమ టీమ్ కష్టమని నిరూపించుకోవడానికి మేకింగ్ వీడియోలు విడుదల చేయాల్సి వస్తోంది. నిజమైన కృషికి గుర్తింపు దక్కాలంటే భవిష్యత్తులో ఈ సవాళ్లు మరింత పెరగొచ్చు.

ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అదిరిపోతే VFX ఇరగదీశారురా బాబూ అనేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు.. ఆ ఏముందిలే AI వాడేసుంటారు అంటున్నారు ఆడియన్స్. దీంతో మన మేకర్స్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. బాబోయ్ మాది AI కాదు.. మేమే కష్టపడి తీశాం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి కష్టాలు పడుతున్న వాళ్లెవరో చూద్దామా..? నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి చేసిన ప్రోమో అదిరిపోయింది.. కానీ అదంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మాయ అని ఫిక్స్ అయిపోయారంతా. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూసి టెన్షన్ పడిన మేకర్స్.. వెంటనే రంగంలోకి దిగి ఇది AI కాదు నిజంగానే చేసారని చెప్పడానికి మేకింగ్ వీడియోనే విడుదల చేయాల్సి వచ్చింది. రాజమౌళికి కూడా ఈ AI టెన్షన్ తప్పట్లేదు.. వారణాసి టీజర్ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అందులో కనిపించేదంతా అన్నీ పక్కా ప్లానింగ్‌తో చేసిన గ్రాఫిక్స్ వర్క్ అని.. అది గానీ AI అంటే ఏడాదిన్నర పాటు తమ టీం పడిన కష్టాన్ని అవమానించినట్లే అన్నారు జక్కన్న. అంతటి దర్శకుడే ఇలా వివరణ ఇచ్చుకుంటున్నారంటే సిచ్యువేషన్ అర్థమైపోతుంది కదా..!స్వయంభు విషయంలో నిఖిల్ కూడా ఈ AI పుకార్లకు చెక్ పెట్టారు.. మిగతా సినిమాల్లాగా షార్ట్ కట్స్‌లో AI వాడుకోలేదని.. ప్రతీ ఫ్రేమ్ వెనుక ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టం ఉందన్నారు. టెక్నాలజీ పెరగడం మంచిదే కానీ.. నిజమైన కష్టానికి గుర్తింపు దక్కాలంటే మేకర్స్ ఇలా మేకింగ్ వీడియోలు, బైట్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతుందేమో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌

9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు

Follow Us