భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో OLX పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురానికి చెందిన భరత్ చంద్రారెడ్డి తన రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ బైక్‌ను విక్రయించేందుకు OLXలో ప్రకటన ఇచ్చాడు. బైక్‌కు సంబంధించిన వివరాలు, ఫోటోలు పోస్ట్ చేయగా, వంశీ అనే వ్యక్తి అతడిని సంప్రదించాడు. బైక్ కొనుగోలు చేస్తానని చెప్పి, ఇద్దరూ ఒక మ్యూచువల్ పాయింట్ వద్ద కలిశారు. అక్కడ వంశీ బైక్‌ను పూర్తిగా పరిశీలించాడు. టెస్ట్ డ్రైవ్ చేసి బైక్ కండిషన్ చూడాలని కోరాడు. భరత్ చంద్రారెడ్డి అంగీకరించడంతో, వంశీ బైక్ తీసుకుని టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లాడు. ఐదు నిమిషాల తర్వాత భరత్ అతడికి ఫోన్ చేయగా, త్వరలో వస్తానని చెప్పాడు. మరో పది నిమిషాల తర్వాత ఫోన్ చేయగా, వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని భరత్ చంద్రారెడ్డి గ్రహించాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.