డైట్‌కు నో చెప్పిన చిరుత! చేతులెత్తేసిన జూ అధికారులు!

×

డైట్‌కు నో చెప్పిన చిరుత! చేతులెత్తేసిన జూ అధికారులు!

సాధారణంగా మనుషులకే కాకుండా, జూలో ఉండే జంతువులకు కూడా బరువు సమస్యలు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితే చైనాలోని పాంజిహువా జూలో ఉన్న 19 ఏళ్ల చిరుతకు ఎదురైంది. తన బొద్దు శరీరం, గుండ్రటి పొట్టతో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన ఈ చిరుతను చూసి, జూ అధికారులు బరువు తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించారు. చిరుత బరువు తగ్గించేందుకు ప్రత్యేక ఆహార ప్రణాళికను అమలు చేయడంతో పాటు, వ్యాయామం చేసేలా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, వయసు మీద పడటంతో బరువు తగ్గించే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని నిపుణులు సలహా ఇచ్చారు. ఈ సూచనతో జూ అధికారులు డైట్ ప్లాన్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం చిరుతకు రోజుకు సుమారు అరకిలో బీఫ్ తో పాటు చికెన్‌ను అందిస్తున్నారు. తాజా వైద్య పరీక్షల్లో చిరుత ఆరోగ్యంగా ఉందని తేలడంతో, దాని బరువు తగ్గించడం కంటే ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచడమే తమ లక్ష్యం అని జూ అధికారులు స్పష్టం చేశారు. డైట్ నుంచి విముక్తి పొందిన ఈ చిరుత ఇప్పుడు హాయిగా, ఆనందంగా ఉంది.

Phani CH