9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం ఎదుర్కొన్న అనేక కథనాల్లో, తొమ్మిదేళ్ల తర్వాత దాచిన రూ.500, రూ.1000 నోట్లను కనుగొన్న ఓ మహిళ వీడియో వైరల్ అవుతోంది. భర్తకు తెలియకుండా దాచి, ఇప్పుడు వాటి విలువ కోల్పోవడంపై ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ వీడియో డీమోనిటైజేషన్ పర్యవసానాలను, సాధారణ ప్రజలపై దాని ప్రభావాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్ర సర్కారు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఆ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్తకు తెలియకుండా దాచిన రూ.500, రూ.1,000 నోట్లను తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. పాతనోట్లను గుర్తించిన తరువాత తన తల్లి తీవ్రంగా ఆందోళన పడి కంటతడి పెడుతోందనీ నాన్నకు తెలియకుండా వీటిని దాచిందని.. కుమార్తె చెప్పుకొచ్చింది. ఇపుడు వీటిని బ్యాంకులు తీసుకుంటాయో లేదో అంటూ తన ఫాలోయర్స్‌ను ఉద్దేశించి అడిగింది. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్ కూడా రికార్డ్ చేయండి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమో అని మరికొందరు సలహా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..
Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు

