AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!

బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!

Phani CH
|

Updated on: Mar 01, 2026 | 8:43 PM

Share

మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్ రుథియా కుటుంబం బ్రిటిష్ ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల పాత అప్పును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. 1917లో వారి తాత సేఠ్‌ జుమ్మా లాల్ బ్రిటిష్ వారికి రూ. 35 వేలు అప్పుగా ఇచ్చారు. పత్రాలను కనుగొన్న వివేక్, ద్రవ్యోల్బణం, వడ్డీతో కలిపి సుమారు రూ. 1.85 కోట్ల కోసం న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది తన తాతకు గుర్తింపు అని అంటున్నారు.

బ్రిటిష్ ప్రభుత్వం తమకు కోట్లాది రూపాయల బాకీ పడిందని.. ఆ అప్పును వడ్డీతో సహా చెల్లించాలని మధ్యప్రదేశ్‌లోని సీహోర్‌కు చెందిన వివేక్ రుథియా అంటున్నారు. వ్యాపారి అయిన తన తాత బ్రిటిషర్లకే అప్పు ఇవ్వడం.. అది శతాబ్దం దాటినా ఇంకా చెల్లించకపోవడం సినిమా స్టోరీలా ఉంది కదూ. 1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధ ఖర్చుల కోసం వారికి అత్యవసరంగా నిధులు అవసరమయ్యాయి. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లోని వ్యాపారవేత్త సేఠ్‌ జుమ్మా లాల్ ను బ్రిటిష్ అధికారులు సంప్రదించగా, ఆయన 35 వేల రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఆ కాలంలో 35 వేలు అంటే అది చాలా పెద్ద మెుత్తం. అందుకు ప్రతిఫలంగా బ్రిటిష్ అధికారులు రాతపూర్వకంగా డాక్యుమెంట్లను జుమ్మా లాల్‌కు అందజేశారు. 1937లో జుమ్మా లాల్ కన్నుమూశారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం రావడం.. బ్రిటిష్ వారు భారత్‌ను విడిచి వెళ్లిపోవడంతో అప్పు విషయం మరుగున పడింది. జుమ్మా లాల్ కుమారుడు సేఠ్‌ మాణక్ చంద్ ఆ పత్రాలను భద్రపరిచారు. 2013లో ఆయన మరణించాక.. ఆ ఆస్తి పత్రాలు మనవడైన వివేక్ చేతికి వచ్చాయి. దాదాపు 22 ఏళ్ల పాటు ఇంట్లోనే పడి ఉన్న ఆ పాత ఫైళ్లను వెలికితీసినప్పుడు అప్పుకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. కేవలం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. 1917 నాటి రూ. 35 వేల విలువ నేడు రూ.కోటి 85 లక్షల పైమాటే. దీనికి వడ్డీని కూడా కలిపితే ఆ మొత్తం కొన్ని పదుల కోట్లకు చేరుతుందని ఆ ఫ్యామిలీ అంటోంది. ప్రస్తుతం వివేక్ ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఒక దేశం తన చారిత్రక ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకోలేదని ఆయన వాదిస్తున్నారు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని.. తన తాత కష్టానికి దక్కాల్సిన గుర్తింపు అని వివేక్ అంటున్నారు. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే వందేళ్ల నాటి పత్రాల అసలు స్థితిని నిరూపించడం అంత ఈజీ కాకపోవచ్చు. ఏదేమైనా బ్రిటీష్ వాళ్లనే అప్పు చెల్లించాలని డిమాండ్‌ చేసే స్థాయికి చేరిన మధ్యప్రదేశ్‌ ఫ్యామిలీ స్టోరీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Follow Us