
సూర్య గ్రహణం
హిందూమతంలో గ్రహణాలు ఒక దృగ్విషయంగా పరిగణించబడతాయి. అంతేకాదు హిందువుల నమ్మకం ప్రకారం గ్రహణాన్ని అశుభమైందిగా భావిస్తారు. కనుక గ్రహణం పట్టే సమయానికంటే ముందు నుంచి గ్రహణం విడిచే సమయం వరకూ సూత కాలంగా భావిస్తారు. ఈ సూత సమయంలో ఆలయ తలపులు తెరవరు. పూజలు, శుభకార్యాలు చేయరు. అంతేకాదు గ్రహణం సమయంలో ఆహారం తినడం, తాగడం వంటి కొన్ని పనులు చేయడం కూడా తప్పుగా భావిస్తారు. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం 29 మార్చి 2025 శనివారం రోజున ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం ఏర్పడే సమయం మధ్యాహ్నం 2:20 గంటల నుంచి సాయంత్రం 6:16 గంటల వరకు ఉంటుంది. పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కనుక సూతక కాలం చెల్లదు.
ఈ సూర్యగ్రహణం సైన్స్ ప్రకారం ఒక ఖగోళ దృగ్విషయం. సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ ఏడాది మార్చి 29న సంభవించనున్న తొలి సూర్యగ్రహణం ఉత్తర అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, రష్యాలో కనిపిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం మన దేశంలో లేదు కనుక ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు చేయాల్సిన పనిలేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శనివారం, అమావాస్య కలిసిన రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది కనుక శివారాధన చేయడం మంచిదని సూచిస్తున్నారు.
News not found!