AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు 'డేటా ట్యాక్స్' కట్టాల్సిందే !

ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !

Phani CH
|

Updated on: Mar 14, 2026 | 12:48 PM

Share

స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగంపై అదనపు పన్ను విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఇంటర్నెట్ వినియోగాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం, యువత స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడం లక్ష్యాలు. ప్రతి జీబీకి రూ.1 పన్నుతో రూ.22,900 కోట్లు సమకూరవచ్చు. ఇది వినియోగదారులకు భారంగా మారనుంది. అయితే, నిర్దిష్ట పరిమితి తర్వాతే పన్ను విధించే స్లాబ్ విధానం సాధ్యం. 'డిజిటల్ ఇండియా' లక్ష్యాలపై ప్రభావంపై అధ్యయనం జరుగుతోంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చేలా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయిన ఇంటర్నెట్ వినియోగాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంతో పాటు, యువతలో పెరుగుతున్న ‘స్క్రీన్ టైమ్’కు అడ్డుకట్ట వేసేందుకు “డేటా వినియోగంపై అదనపు పన్ను” విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన టెలికాం రివ్యూ సమావేశంలో ఈ అంశంపై ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం భారతీయులు ఏకంగా 229 బిలియన్ జీబీల డేటాను వాడేశారు. ఈ లెక్కన ప్రతి ఒక జీబీ డేటాపై ఒక్క రూపాయి చొప్పున ట్యాక్స్ విధిస్తే, ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి సుమారు రూ. 22,900 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. ప్రస్తుతం టెలికాం సేవలపై 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులకు, ఈ కొత్త పన్ను భారంగా మారనుంది. అయితే, అందరిపై ఒకేలా కాకుండా ఒక నిర్దిష్ట పరిమితి దాటిన తర్వాతే ఈ ట్యాక్స్ విధించే ‘స్లాబ్ విధానం’ ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన ఎంతవరకు సాధ్యం? దీనివల్ల ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యాలకు ఆటంకం కలుగుతుందా? అనే అంశాలపై అధ్యయనం చేయాలని టెలికాం శాఖను కేంద్రం ఆదేశించింది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ నివేదిక రానుంది. ప్రభుత్వం నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ, నెటిజన్లలో మాత్రం అప్పుడే ఆందోళన మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!

Follow Us