Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భారతీయ హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ కొరతతో హోటళ్లు బంద్ అవుతుండగా, 90% రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హోటళ్లు బొగ్గు, కట్టెల పొయ్యిల వైపు మళ్లుతుండగా, ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్రంగా కుదేలైంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో గ్యాస్ కొరతతో హోటళ్లు బంద్ అవుతున్నాయి. మరికొన్ని హోటళల్ మెనూలో వంటకాలను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ క్రమంలో 48 గంటల్లో 90% రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా యుద్ధ ప్రభావం భాగ్యనగర హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా నగరంలోని హోటళ్లకు వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. దీంతో గ్యాస్ స్టవ్‌లు వెలవెలబోతుండగా, హోటల్ యజమానులు ప్రత్యామ్నాయంగా మళ్లీ పాత కాలం నాటి బొగ్గు, కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నగరంలో కట్టెల దుకాణాలకు పోటెత్తుతున్నారు జనం. హోటల్ రంగంవారే కాకుండా సామాన్య ప్రజలు కూడా కట్టెల పొయ్యివైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు, వంటలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ సర్వీసులను కూడా పలు హోటళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రాకపోతే రానున్న రోజుల్లో హోటల్‌లో ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Harish Shankar: మహేష్ అభిమానులకు సారి చెప్పిన హరీష్
Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్ వారసుడు.. టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!
అడ్డంగా దొరికిపోయిన వందే భారత్ టీటీఈ.. వీడియో వైరల్
బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ??

