AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్‌ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే!

ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్‌ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే!

Phani CH
|

Updated on: Nov 20, 2026 | 7:07 PM

Share

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీసుల పార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నట్లు స్టేషన్ రికార్డుల్లో నమోదు చేసుకుని, అనుమతి లేకుండానే కొందరు సిబ్బంది ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేన్ డ్యాన్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తూ విందు వినోదాల్లో మునిగితేలడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వ్యవహారశైలి పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. అధికారికంగా విధుల్లో ఉన్నట్లు స్టేషన్ రికార్డుల్లో నమోదు చేసుకుని, పట్టపగలే ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. నవంబరు 15న బెల్లంపల్లి వన్ టౌన్ స్టేషన్ రికార్డుల ప్రకారం మొత్తం 15 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నట్లు నమోదైంది. అయితే, ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు మినహా మిగిలిన సిబ్బంది తాండూర్ మండలం కత్తెర్ల గ్రామ సమీపంలోని ఓ రిసార్ట్ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. సెలవు పెట్టకుండా, కనీసం స్టేషన్ మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయకుండానే వారు ఈ పార్టీకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫామ్‌హౌస్‌లో మహిళా సిబ్బందితో కలిసి రేన్ డ్యాన్స్‌లు చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటలతో రోజంతా జల్సా చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు హాజరైన ఒక వ్యక్తి ఆ వీడియోలను తన మిత్రులకు షేర్ చేయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆ రోజు ఎంతమంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారు, ఎందరు అనుమతి తీసుకుని వెళ్లారు అనే అంశాలపై విచారణ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Antony: విజయ్ ఆంటోని చెప్పులు ఎందుకు ధరించడో తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు

డాలర్‌ కు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. అసలు విషయం ఇదేనా?

నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ.. ఏకంగా 91 లక్షల గోల్డ్‌ కొట్టేసిన ఉద్యోగి

కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌

గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే

Follow Us