నాగార్జునను సూటిగా ప్రశ్నించా…దాన్ని బయటికి రాకుండా చేశారు!

×

నాగార్జునను సూటిగా ప్రశ్నించా…దాన్ని బయటికి రాకుండా చేశారు!

బిగ్‌బాస్ తెలుగు షోలో తనపై వచ్చిన విమర్శలు, అవమానాల గురించి నటుడు రోహిత్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎదురైన బ్లాక్ మార్క్కు తాను అర్హుడిని కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలోనూ చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాటపై నిలబడతానని తెలిపారు. ఈ అంశంపై హోస్ట్ అక్కినేని నాగార్జునతో తాను నేరుగా మాట్లాడినట్లు రోహిత్ నాయుడు వెల్లడించారు. తన ముఖంపై “తూ” అని ఉమ్మేసినవారిని కూడా పాయింట్ ఔట్ చేయకుండా, తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నాగార్జునను సూటిగా ప్రశ్నించినట్లు చెప్పారు. తాను అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదని, అయినప్పటికీ తనను మాత్రమే నిందించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నాగార్జునతో జరిగిన ఈ సంభాషణ బయటికి రాలేదని రోహిత్ నాయుడు పేర్కొన్నారు. చాలా విషయాలు బయటికి రానివ్వలేదని, ముఖ్యంగా తాను అడిగిన ఈ ప్రశ్నలు, నాగార్జునతో జరిగిన సంభాషణ ప్రజలకు చేరలేదని ఆయన స్పష్టం చేశారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను రోహిత్ నాయుడు పంచుకున్నారు.

Phani CH