AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Grahan: ఈ ఏడాదిలో చివరి గ్రహణం వెరీ వెరీ స్పెషల్.. చంద్రవంకగా ఆదిత్య దర్శనం..

ఈ నెలలో భాద్రప్రద మాసం పౌర్ణమి రోజున ఇప్పటికే అద్భుతమైన చంద్రగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు అంటే భాద్రప్రద మాసం అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడే సమయం ఆసన్నం అవుతోంది. వెరీ వెరీ స్పెషల్ పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ రోజు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? సమయం, తేదీ, కనిపించే దేశాల గురించి తెలుసుకుందాం.

Surya Grahan: ఈ ఏడాదిలో చివరి గ్రహణం వెరీ వెరీ స్పెషల్.. చంద్రవంకగా ఆదిత్య దర్శనం..
Surya Grahan 2025Image Credit source: social media
Surya Kala
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 18, 2025 | 1:54 PM

Share

ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనలలో ఒకటి సూర్యగ్రహణం. ఈఏడాది చివరి గ్రహణం సూర్య గ్రహణం.. అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది. ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంఘటన శరదృతువు విషువత్తు ఒక రోజు ముందు ఏర్పడుతుంది. పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే ఈ సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ సూర్యగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదు. అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు. అందుకనే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ సూర్యగ్రహణం తేదీ, సమయం, దానిని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం.

సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?

ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ, 2025న సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం., ఈ గ్రహణం దాదాపు రాత్రి 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 (సెప్టెంబర్ 22) వరకు ఉంటుంది. అంటే ఈ సంఘటన అర్థరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా.. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు.

ఈ గ్రహణాన్ని ఎక్కడ ఏర్పడుతుంటే?

  1. ఈ గ్రహణం దక్షిణ అర్ధగోళం నుంచి మాత్రమే కనిపిస్తుంది.
  2. ఈ గ్రహణం న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యునిలో 86% చంద్రుడు తో కప్పబడి ఉంటాడు.
  3. స్టీవర్ట్ ద్వీపం, క్రైస్ట్‌చర్చ్ కి చెందిన ప్రజలు సూర్యగ్రహణం అద్భుతమైన దృశ్యాన్ని చూడగలరు.
  4. అంటార్కిటికాలోని రాస్ సీ కోస్ట్, యంగ్ ఐలాండ్ వంటి దీవుల నుంచి కూడా గ్రహణం కనిపిస్తుంది.
  5. న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో, సెప్టెంబర్ 22న ఉదయం 6:27 గంటలకు సూర్యుడు పాక్షికంగా కప్పబడి.. ఉదయిస్తాడు.
  6. యూరప్, ఉత్తర అమెరికాలోని ప్రజలు ఈ ప్రత్యేక సూర్యగ్రహణాన్ని చూడలేరు.

ఈ గ్రహణం ఎందుకు ప్రత్యేకమైనది?

ఈ గ్రహణం భారత దేశ సమయం ప్రకారం.. సూర్యోదయం సమయంలో సంభవిస్తుంది. అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితిజ సమాంతరంగా కనిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన దృశ్యం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహణం, సూర్యోదయం ఒకేసారి సంభవించడం చాలా అరుదు. ఇంకా ఈ సంఘటన శరదృతువు విషువత్తుకు ముందు సంభవిస్తుంది. కనుక ఈ గ్రహణ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.

సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది. న్యూజిలాండ్, అంటార్కిటికాలోని ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించగలరు. భారతదేశంలో ఇది స్పష్టంగా కనిపించకపోయినా.. ప్రతి ఒక్కరూ దీన్ని ఆన్‌లైన్‌లో చూడవచ్చు.