AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నడిగుల ఆడపడుచు శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారు.. చీర-సారెలతో నల్లమల అడవిలో పాదయాత్రగా..

Sri Sailam Bhramarambika Amman: శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున సమేత శ్రీ భ్రమరాంబికా దేవికి ఏటా ఉగాది ఉత్సవాలకు పుట్టింటి నుంచి సారె తీసుకురావడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అమ్మవారి పుట్టిల్లుగా భావించే కర్ణాటక నుంచి భక్తులు సారె తీసుకొస్తున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సారెగా సమర్పిస్తారు. ఇందుకోసం కర్నాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు నల్లమల అడవిని దాటుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు

Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 1:51 PM

Share
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొలువైన ఉన్న భ్రమరాంబికా దేవి అమ్మవారిని కర్ణాటక వాసులు తమ ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ప్రతియేటా ఉగాది ఉత్సవాల నాటికి తమ ఇంటి ఆడపడుచుకు చీర, సారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.  అందులో భాగంగా ఈ ఏడాది కూడా చీరె, సారెలతో కర్నాటకకు చెందిన భక్తులు నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్ర చేసుకుంటూ పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

1 / 5

అమ్మవారికి పుట్టింటి సారె...
 
శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున సమేత శ్రీ భ్రమరాంబికా దేవికి ఏటా ఉగాది ఉత్సవాలకు పుట్టింటి నుంచి సారె తీసుకురావడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అమ్మవారి పుట్టిల్లుగా భావించే కర్ణాటక నుంచి భక్తులు సారె తీసుకొస్తున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సారెగా సమర్పిస్తారు. ఇందుకోసం కర్నాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు నల్లమల అడవిని దాటుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కన్నడ భక్తులతో నల్లమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

అమ్మవారికి పుట్టింటి సారె... శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున సమేత శ్రీ భ్రమరాంబికా దేవికి ఏటా ఉగాది ఉత్సవాలకు పుట్టింటి నుంచి సారె తీసుకురావడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అమ్మవారి పుట్టిల్లుగా భావించే కర్ణాటక నుంచి భక్తులు సారె తీసుకొస్తున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సారెగా సమర్పిస్తారు. ఇందుకోసం కర్నాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు నల్లమల అడవిని దాటుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కన్నడ భక్తులతో నల్లమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

2 / 5
పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న భక్తులు చేస్తున్న శివన్నామస్మరణతో అటవీప్రాంతం మార్మోగిపోతోంది. ఉగాది పర్వదినానికి ముందే కర్నాటక    భక్తులు శ్రీశైలానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు.

3 / 5

కాళ్ళకు కర్రలు కట్టుకుని పాదయాత్ర...

కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. ఉగాదికి ముందు గానే తమ సొంత ప్రాంతాల నుంచి బయలుదేరి ఉగాది పండగకు ముందు శ్రీశైలం చేరుకుంటారు.  కొంతమంది యువకులు కాళ్ళకు పొడవాటి కర్రలు కట్టుకుని పాదయాత్ర చేయడం విశేషం.

కాళ్ళకు కర్రలు కట్టుకుని పాదయాత్ర... కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. ఉగాదికి ముందు గానే తమ సొంత ప్రాంతాల నుంచి బయలుదేరి ఉగాది పండగకు ముందు శ్రీశైలం చేరుకుంటారు. కొంతమంది యువకులు కాళ్ళకు పొడవాటి కర్రలు కట్టుకుని పాదయాత్ర చేయడం విశేషం.

4 / 5
భక్తుల పాదయాత్ర నల్లమలలోని దట్టమైన అటవీప్రాంతం నుంచి కొనసాగుతుండటంతో అటవీశాఖ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒంటరిగా పాదయాత్ర చేయవద్దని,  గుంపుగుంపులుగా పాదయాత్ర చేయాలని సూచిస్తున్నారు. అడవిలో వన్యమృగాల దాడులు నివారించేందుకు చేతిలో కర్రలు ధరించాలని సూచిస్తున్నారు. మరోవైపు, ఉగాదికి పది రోజుల ముందునుంచే శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..