రసవత్తరంగా ఓటింగ్ త్రిగుణ్‌‌ను దాటేసిన అతడు

×

రసవత్తరంగా ఓటింగ్ త్రిగుణ్‌‌ను దాటేసిన అతడు

బిగ్‌బాస్ 10 తెలుగు 11వ వారం ఓటింగ్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. విజేత అంచనాలపై సాగుతున్న చర్చ మధ్య, అనధికార ఓటింగ్ సర్వేలు అనూహ్య ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ వారం 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉండగా, త్రిగుణ్ మరియు ముఖేష్ గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కుటుంబ సభ్యుల నుంచి సానుకూల రేటింగ్స్‌తో త్రిగుణ్ విజేత రేసులో ముందున్నట్లు భావించినప్పటికీ, ఓటింగ్ సరళిలో మార్పు వచ్చింది. తన సీరియల్ అభిమానుల మద్దతుతో ముఖేష్ గౌడ్ త్రిగుణ్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుత ఓటింగ్ ప్రకారం, ముఖేష్ సుమారు 30.86 శాతం ఓటింగ్‌తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు. త్రిగుణ్ 30.56 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 0.3 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. మిగిలిన నామినేటెడ్ కంటెస్టెంట్లలో అమన్, దేబ్జాని చెరో 8 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యల్ప ఓట్లతో నీతూ మాస్టర్ (1 శాతం) ఎలిమినేషన్ అంచున ఉన్నట్లు ఓటింగ్ సర్వే సూచిస్తోంది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి నీతూ మాస్టర్ నిష్క్రమించే అవకాశం ఉంది.

Samatha J