ఇంగ్లాండ్ రికార్డుకే ఎసరు పెట్టిన వైభవ్!.. ఇది బ్యాటింగ్ కాదు విధ్వంసం!

×

ఇంగ్లాండ్ రికార్డుకే ఎసరు పెట్టిన వైభవ్!.. ఇది బ్యాటింగ్ కాదు విధ్వంసం!

క్రికెట్ ప్రపంచంలోకి ఒక కొత్త సంచలనం అడుగుపెట్టింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులతో డబుల్ సెంచరీ పూర్తి చేసి, బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, అద్భుతమైన 28 సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్ కొట్టిన 28 సిక్సర్లు ఒక వన్డే ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు సాధించిన 26 సిక్సర్ల రికార్డును కూడా దాటేశాయి. అంటే, ఒక జట్టు మొత్తం కలిసి కొట్టిన సిక్సర్ల కంటే ఈ యువ ఆటగాడు ఒక్కడే రెండు సిక్సర్లు ఎక్కువ బాదాడు. అంతేకాదు, వెస్టిండీస్ (23), న్యూజిలాండ్ (22), సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా (చెరో 20), భారత్ (19) సిక్సర్లతో ఉన్న రికార్డులను కూడా వైభవ్ తన ఒక్క ఇన్నింగ్స్‌తో వెనక్కి నెట్టేశాడు. వ్యక్తిగత రికార్డుల విషయానికొస్తే, లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేశాడు. మొత్తానికి, వైభవ్ ఆడింది ఒక ఇన్నింగ్స్ మాత్రమే. కానీ బద్దలు కొట్టింది మాత్రం ఎన్నో దిగ్గజ రికార్డులు. ఈ కుర్రాడి బ్యాటింగ్ విధ్వంసానికి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు.

Samatha J