AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్‌పై పోరాటానికి ప్రభాస్ మద్దతు..యువతకు రెబల్ స్టార్ పిలుపు

డ్రగ్స్‌పై పోరాటానికి ప్రభాస్ మద్దతు..యువతకు రెబల్ స్టార్ పిలుపు

Samatha J
|

Updated on: Nov 25, 2026 | 1:02 PM

Share

ప్రభాస్ నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో జరగనున్న అవగాహనా యాత్రలో భాగస్వామ్యం కావాలని ప్రభాస్ కోరారు.

సినీ నటుడు ప్రభాస్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా, ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పేరుతో మూడు రోజుల పాటు పాదయాత్ర జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభాస్ కోరారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల కిషన్ రెడ్డి స్వయంగా ప్రభాస్ నివాసానికి వెళ్లి కలిసి, అవగాహనా యాత్రలో పాల్గొని యువతకు స్ఫూర్తినివ్వాలని కోరారు. డ్రగ్స్ పై పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అప్పట్లో మాట ఇచ్చిన ప్రభాస్, తాజాగా ఒక వీడియో సందేశం ద్వారా మరోసారి తన మద్దతును తెలిపారు. “Together we can make India a drug free nation. Lets support this wonderful initiative by Kishan Reddy ji, inspired by the vision of our Honourable Prime Minister Shri Narendra Modi ji” అని ప్రభాస్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

Follow Us