AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజీవ్ హత్యకు కుట్ర: భద్రత తొలగింపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

రాజీవ్ హత్యకు కుట్ర: భద్రత తొలగింపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Samatha J
|

Updated on: Nov 25, 2026 | 12:10 PM

Share

రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు ఉద్దేశపూర్వకమేనని సంచలన ఆరోపణలు చేశారు. భద్రతను తొలగించడం వల్లనే ఆయన హత్య జరిగిందని, ఇది కేవలం పరిస్థితులను సృష్టించడం కోసమే జరిగిందని రాహుల్ స్పష్టం చేశారు. తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథపై సంభాషణలో ఈ కీలక విషయాలను వెల్లడించారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి ఆయన కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఆయనకు కల్పించిన భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని రాహుల్ స్పష్టం చేశారు. ఈ భద్రత తొలగింపు కేవలం హత్యకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం కోసమే జరిగిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ, చెల్లి ప్రియాంక గాంధీతో కలిసి “బిలాంగింగ్” అనే ఆత్మకథపై జరిగిన సంభాషణలో రాహుల్ గాంధీ ఈ విషయాలను వెల్లడించారు. తాను చూసిన పరిస్థితులను వివరిస్తూ, ఈ అంశాలను తన తల్లి ఆత్మకథలో ప్రస్తావించడం మర్చిపోయారని తెలిపారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ బిహార్ పర్యటనలో ఉన్నప్పుడు రాహుల్ కూడా ఆయనతో ఉన్నాడని గుర్తుచేశారు. తన తండ్రిపై రాళ్ల దాడి, వ్యతిరేకతను రాహుల్ చూశాడని సోనియా తెలిపారు. బిహార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, “అమ్మా, మనం నాన్న భద్రత విషయంలో ఏదో ఒకటి చేయకపోతే, నాన్న అంత్యక్రియల కోసం నేను త్వరలోనే మళ్లీ ఇంటికి రావాల్సి వస్తుంది” అని రాహుల్ తనతో చెప్పాడని సోనియా వివరించారు.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

 

Follow Us