AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Rambha: అందంలో అమ్మను మించిపోయిందిగా..! రంభ కూతురిని చూశారా..

ఒకప్పుడు తన అందం, అభినయం, అదిరిపోయే డ్యాన్స్‌తో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన అందాల తార రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తన గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది.

Rajeev Rayala
|

Updated on: Nov 26, 2026 | 12:40 PM

Share
ఒకప్పుడు తన అందం, అభినయం, అదిరిపోయే డ్యాన్స్‌తో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన అందాల తార రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తన గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. ఈ క్రమంలో రీసెంట్ గా రంభ షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆమె పెద్ద కుమార్తె అందం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

1 / 5
 విజయవాడకు చెందిన విజయలక్ష్మి సినీ రంగంలోకి అడుగుపెట్టి రంభగా స్టార్‌డమ్ సంపాదించుకుంది. తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుంది. అనంతరం కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలకు దూరమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

2 / 5
తాజాగా రంభ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో తల్లితో కలిసి కనిపించిన ఆమె కుమార్తె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అచ్చం రంభ పోలికలతో ఎంతో అందంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. చిన్నతనంలో రంభను చూసినట్లుగానే ఉందని, తల్లి అందం కూతురికి వచ్చిందంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

3 / 5
1992లో మలయాళ చిత్రం 'సర్గం'తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రంభ.. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.

4 / 5
పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైనప్పటికీ రంభ అభిమానులకు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడు టెలివిజన్ కార్యక్రమాల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోంది. మరోవైపు ఆమె రీఎంట్రీ గురించి కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సరైన కథ, తనకు నచ్చిన పాత్ర లభిస్తే మళ్లీ సినిమాల్లో నటిస్తుందా? అన్న చర్చ సాగుతోంది. మరి ఈ అందాల తార మరోసారి వెండితెరపై సందడి చేస్తుందో లేదో చూడాలి.

5 / 5
Follow Us