AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: యూట్యూబ్ నుంచి నెలకు రూ.30 లక్షల ఆదాయం అందుకున్న సీరియల్ నటి..

ప్రముఖ సీరియల్ నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమ్ తమ యూట్యూబ్ ఆదాయంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొన్ని నెలల్లో యూట్యూబ్ ద్వారా రూ.30 లక్షల వరకు సంపాదించినట్లు తెలిపారు. ఈ ఆదాయంలో వ్యూస్‌తో పాటు బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా భాగమని స్పష్టం చేశారు.

Tollywood: యూట్యూబ్ నుంచి నెలకు రూ.30 లక్షల ఆదాయం అందుకున్న సీరియల్ నటి..
Serial Actress
Ram Naramaneni
|

Updated on: Nov 26, 2026 | 12:19 PM

Share

ప్రముఖ సీరియల్ నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమ్ తమ యూట్యూబ్ ఆదాయం, ఆర్థిక పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలను గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. సోషల్ మీడియాలో తమ సంపాదన, విలాసవంతమైన జీవితం గురించి జరుగుతున్న ప్రచారంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తమకు భారీ ఆదాయం వస్తోందని, విల్లాలు, ఖరీదైన కార్లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో యూట్యూబ్ ద్వారా నెలకు రూ.30 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు శ్రీవాణి వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో శ్రీవాణి, విక్రమ్‌ల విల్లాలు, లగ్జరీ కార్ల గురించి యాంకర్ ప్రశ్నించారు. దీనికి వారు స్పందిస్తూ.. ఇప్పటివరకు తమకు ఓ ఇల్లు మాత్రమే ఉందని వివరించారు. తాజాగా ఈ బిజీ ప్రపంచానికి దూరంగా మరో గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి ఆమే ఓ వీడియో యూట్యూబ్‌లో పెట్టారు.

ఇటీవల యూట్యూబర్లు తమ సంపాదన గురించి బహిరంగంగా మాట్లాడుతున్న నేపథ్యంలో.. శ్రీవాణి, విక్రమ్‌ల యూట్యూబ్ ఆదాయంపై కూడా ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దీనిపై శ్రీవాణి స్పందిస్తూ.. తాము ఎప్పుడూ తమ ఆదాయ వివరాలను బయటపెట్టలేదని చెప్పారు. అయితే తమ ఛానెల్‌కు వస్తున్న వ్యూస్‌ను ఆధారంగా చేసుకుని కొందరు యూట్యూబర్లు ఆదాయాన్ని అంచనా వేస్తూ వీడియోలు చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇతరులు వేసిన లెక్కల గురించి తమకు తెలియదని, తాము కూడా ఎప్పుడూ అలా లెక్కలు వేసుకోలేదని పేర్కొన్నారు.

ఇంటర్వ్యూలో యాంకర్ మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్‌కు నెలకు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఆదాయం వస్తుందని, ఆ ఛానెల్‌కు ఉన్న వ్యూయర్‌షిప్‌తో పోలిస్తే మీ ఛానెల్‌కు కూడా అంతే ఆదాయం వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి శ్రీవాణి సమాధానమిస్తూ.. కొన్ని నెలల్లో తమకు రూ.30 లక్షల వరకు ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నాయని అంగీకరించారు. ముఖ్యంగా తమ కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్ జరిగిన నెలలో, అలాగే కొత్త ఇంటి గృహప్రవేశం జరిగిన నెలలో ఈ స్థాయిలో ఆదాయం వచ్చిందని వివరించారు. అయితే ఈ మొత్తం కేవలం యూట్యూబ్ వ్యూస్ ద్వారానే రాలేదని, బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా ఆదాయంలో భాగమని స్పష్టం చేశారు. ప్రతి వీడియోకు కొలాబరేషన్స్ చేయమని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలాంటి అవకాశాలు వస్తాయని తెలిపారు.

యూట్యూబ్ ద్వారా వచ్చిన అధిక ఆదాయం తమ జీవితంలో కీలక మార్పునకు కారణమైందని శ్రీవాణి, విక్రమ్ వెల్లడించారు. ఆ సంపాదనతోనే కొత్త ఇంటి కోసం అడ్వాన్స్ చెల్లించి ఇంటిని తీసుకున్నట్లు తెలిపారు. తమ యూట్యూబ్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. మొత్తానికి సోషల్ మీడియాలో తమ ఆస్తులు, సంపాదనపై జరుగుతున్న ప్రచారానికి శ్రీవాణి, విక్రమ్ తమదైన శైలిలో సమాధానమిచ్చారు. నిరాడంబరంగా జీవిస్తూ, యూట్యూబ్ ద్వారా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామని వారి మాటల్లో స్పష్టమైంది.

Follow Us