ఆ సినిమా చూశాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. శ్రీలీల కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
25 November 2026
తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ శ్రీలీల తన తాజా ఇంటర్వ్యూ వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.
శ్రీలీల మాట్లాడుతూ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వచ్చిన ‘అమరన్’ చిత్రాన్ని చూసిన తర్వాత తనకు కలిగిన తీవ్రమైన భావోద్వేగాన్ని పంచుకున్నారు.
ఆ సినిమా చూశాక తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానంటూ శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఏదైనా సినిమా చూసినప్పుడు ఆ ప్రభావం కొద్దిసేపు మాత్రమే ఉంటుందని, కానీ అమరన్ మాత్రం చాలాసేపు మనసులో నిలిచిపోయిందని శ్రీలీల తెలిపారు.
ఆ చిత్రం తనకు ఎంతో బరువైన అనుభూతిని మిగిల్చిందని, సినిమా చూసిన తర్వాత కలిగిన ఆ వేదనను, ఆ బాధను మాటల్లో చెప్పలేనని వివరించారు
ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితికి తన మనసు చేరుకుందని, ఆ సినిమా తనపై అంత గాఢమైన ప్రభావం చూపిందని శ్రీలీల చెప్పుకొచ్చారు.
‘అమరన్’ చూసి అంతలా చలించిపోయిన తర్వాత, భవిష్యత్తులో అదే టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని శ్రీలీల పేర్కొన్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి అనతికాలంలోనే దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఎదిగిన శ్రీలీల, తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్