పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. హాల్దీ ఫోటోస్ చూశారా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

24 November 2026

తెలుగు, తమిళ చిత్రాల్లో తన సహజమైన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాళిని రవి మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. 

'గద్దలకొండ గణేష్' సినిమాలో బుజ్జమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు విశేషంగా చేరువైన ఆమె, ఇటీవల తన ప్రియుడు మహావిష్ణుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి ఫోటోలు పంచుకున్న కొద్దిరోజులకే తాజాగా తన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను  మృణాళిని రవి అభిమానులతో షేర్ చేశారు.

పెళ్లి వేడుకలకు ముందు జరిగిన హల్దీ సంబరాల్లో మృణాళిని రవి, మహావిష్ణు ఆనందంగా గడిపిన క్షణాలు ఈ ఫోటోలలో కనిపిస్తున్నాయి.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వేడుక వాతావరణంలో సాగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి.

 ఇప్పటికే వివాహ వేడుక ఫోటోలతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న మృణాళిని రవి, తాజా హల్దీ ఫోటోలతో మరింత దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

పెళ్లికి సంబంధించిన ఒక్కొక్క వేడుక విశేషాలను, జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

డబ్‌స్మాష్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన మృణాళిని రవి, ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకున్నారు. తెలుగులో 'గద్దలకొండ గణేష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.