ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్‌గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్‌లో tv9 ఛానల్ ఎయిర్‌లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్‌గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra News: ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
కామాతురాణం న భయం, న లజ్జ అన్నారు నాటి పెద్దలు.. ఆ మాటు ఇప్పుడు నిజమవుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కామాంధులు.. వస్సుతో సంబంధం లేకుండా మహిళలపై అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతకుడు తన మనవరాలి వయస్సున్న ఇద్దరి బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
- Fairoz Baig
- Updated on: Dec 27, 2025
- 10:52 am
Andhra: మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.! రికవరీ చాలా ఈజీ..
ప్రజలు వివిధ కారణాలతో తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకోవడమో, లేక చోరీకి గురవడమో అయిన సందర్భాల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఇలా సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వాటిలో ఉండే విలువైన డేటాను కోల్పోయి అనేక ఇబ్బందులు..
- Fairoz Baig
- Updated on: Dec 24, 2025
- 2:48 pm
Andhra: ఆస్తి కోసం ఎంతకు తెగించావురా.. బతికుండగానే తల్లిని చంపేశాడు… ఇక నెలకు 15 వేలు కట్టాల్సిందే.
ఆస్తి కోసం తల్లి బతికుండగానే రికార్డుల్లో చంపేశాడు కొడుకు. తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూమిని అమ్మేసి, వృద్ధాశ్రమంలో ఉన్న తల్లికి ఘోరీ కట్టాడు. చివరికి మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్–2007 ఆమెకు న్యాయం చేసింది.
- Fairoz Baig
- Updated on: Dec 23, 2025
- 7:39 pm
Andhra: తెలిసిన వ్యక్తి ఇంటికి సంచితో వచ్చి మందు సిట్టింగ్ వేశాడు.. నైట్ అతను నిద్ర పోతున్నప్పుడు
ఏడు వేల రూపాయల అప్పు… ఒక నిండుప్రాణాన్ని బలితీసుకుంది. టంగుటూరులో జరిగిన ఈ దారుణ హత్యలో స్నేహమే శత్రువైంది. చిన్న అప్పుపై పెరిగిన కక్ష చివరకు కత్తిపోట్లకు దారి తీసింది. ఎలాంటి క్లూ లేకపోయినా, సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు రోజుల్లోనే హంతుకుడ్ని పట్టుకున్నారు పోలీసులు. డబ్బు కోసం మనిషి ఎంత దారుణంగా మారతాడో చెప్పే హృదయవిదారక ఘటన ఇది.
- Fairoz Baig
- Updated on: Dec 23, 2025
- 3:50 pm
Watch Video: మీరు ఒక్కసారి ఈ స్టేషన్‌కు వెళ్తే.. తిరిగి రమ్మన్నారారు.. ఎందుకో తెలుసా?
తుపాకులు, లాఠీలు, ఖాకీ డ్రస్‌లతో పోలీస్ స్టేషన్ పరిసరాలు గంభీరంగా కనిపిస్తుంటాయి.. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే సామాన్యులు భయపడుతుంటారు. పోలీసులు కూడా తరచూ నేరాలు, ఘోరాలు చూసి విగిసిపోయుంటారు.. వీటి వల్ల కొన్ని సార్లు ఒత్తిడికి కూడా లోనవుతుంటారు. ఇలాంటి వాతావరణం ఒక్కసారిగా పక్షుల కిలకిలతో, ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా మారిపోతే ఎలా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న అన్ని నెషన్స్ పోయి మనసు ఆహాయిగా అనిపిస్తుంది కదా.. అచ్చం అదే ఆలోచన చేశారు ఇక్కడి పోలీసులు.
- Fairoz Baig
- Updated on: Dec 22, 2025
- 10:11 pm
Prakasam district: ఓర్నాయనో ఒంటరిగా ఉంటున్నారా… హంతకులున్నారు జాగ్రత్త.
ఒంటరిగా ఉంటున్న వృద్దుల్ని టార్గెట్ చేస్తోంది ఎవరు... ఇటీవల టంగుటూరులో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి హత్య ఘటన మరవకముందే, తాజాగా గోగినేనివారిపాలెంలో ఒంటరిగా ఉంటున్న మరో మహిళను హత్య చేశారు దుండగులు... రెండు హత్యలు ఒకరే చేశారా... లేదా యాధృచ్చకంగా చోరీల కోసం వచ్చి వేరువేరు దొంగలు హత్యలు చేస్తున్నారా... లేక హత్యల వెనుక ఉన్మాదం ఏమైనా ఉందా...? ఇప్పుడు ఇవే ప్రకాశం జిల్లా పోలీసులను తీవ్రంగా కలచివేస్తున్న ఘటనలు... రెండు రోజుల వ్యవధిలో ప్రకాశం జిల్లాలో మిస్టరీగా మారిన రెండు వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి.
- Fairoz Baig
- Updated on: Dec 19, 2025
- 9:55 pm
Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద..
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నల్లకోడి, గుమ్మడికాయ వంటి పూజాసామాగ్రి కనిపించడంతో రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. .. .. ..
- Fairoz Baig
- Updated on: Dec 19, 2025
- 7:24 pm
Tanguturu: సెక్యూరిటీ గార్డును కత్తులు, గొడ్డళ్లలతో నరికి చంపాల్సిన అవసరం ఏంటి..?
ప్రయివేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసింది ఎవరు... చోరీ కోసం వచ్చి ప్రతిఘటిస్తే హతమార్చారా... లేక ఆయనతో ఎవరికైనా పాతకక్షలు ఉన్నాయా... ఒంటరిగా ఉన్న ఆ సెక్యూరిటీ గార్డును కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది... రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చిన ఈ దారుణ హత్య ఘటనలో ప్రకాశం జిల్లా పోలీసుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే... ఇంతకీ ఏం జరిగింది.
- Fairoz Baig
- Updated on: Dec 18, 2025
- 7:27 pm
ఆమె వచ్చిందంటేనే హడల్.. చిన్న పిల్లడితో కలిసి వచ్చి ఈ సారి అడ్డంగా దొరికిపోయింది.. వీడియో చూస్తే..
ఆమె చోరీకి వచ్చిందంటే చాలు ఎవరైతే నాకేంటి అన్న లెవెల్లో చేతివాటం ప్రదర్శిస్తుంది.. చుట్టూ ఎవరైనా ఉన్నారా... నిఘా నేత్రం సిసి టివి కెమెరాలు ఉన్నాయా అన్న సోయి కూడా ఉండదు.. చేయాలన్న పనిని క్షణాల్లో ముగించుకుని ఉడాయించడం ఆమె స్పెషాలిటీ.. తనతో పాటు మరో మహిళను, ఓ చిన్న పిల్లాడిని తీసుకొస్తుంది.
- Fairoz Baig
- Updated on: Dec 18, 2025
- 10:41 am
Andhra: అమ్మాయికి మొగుడు… అత్తకు యముడు… ఎక్కడంటే..
కూతురు ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమన్న అనుమానంతో అతను కోపం పెంచుకున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లిలో అత్తపై కత్తితో దాడి చేయగా, ప్రతిదాడిలో ఇతనికీ గాయాలయ్యాయి. గ్రామం, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. . . . .
- Fairoz Baig
- Updated on: Dec 15, 2025
- 7:30 pm
Andhra: అరె.. అప్పుడే వచ్చిన మామిడి పండ్లు…
వేసవిలో మాత్రమే కనిపించే మామిడిపండ్లు ఇప్పుడు చలికాలంలోనూ నోరూరిస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరి నుంచి ఆఫ్ సీజన్ మామిడిపండ్లను ఒంగోలుకు తీసుకొచ్చి రహదారుల పక్కన విక్రయిస్తున్నారు. చలిలో మామిడిపండ్లు కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యంతో కొనుగోలు చేస్తున్నారు. .. .. .. ..
- Fairoz Baig
- Updated on: Dec 14, 2025
- 8:22 pm
Andhra: పశువులను మేత కోసం అడవిలోనికి తోలుకెళ్లిన కాపర్లు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లె గ్రామానికి చెందిన దంపతులు సారమేకల శ్రీనివాసులు–శారదలు అప్పుల బాధతో ఐదు నెలల క్రితం అదృశ్యమయ్యారు. తాజాగా సంజీవరాయునిపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
- Fairoz Baig
- Updated on: Dec 13, 2025
- 7:14 pm