AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Finn Allen : 33 బంతులు.. 10 ఫోర్లు.. 8 సిక్సర్లు..కేవలం 4 డాట్ బాల్స్.. అలెన్ కొట్టిన కొట్టుడికి రికార్డులన్నీ బద్దలు

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకున్న వేళ క్రికెట్ ప్రపంచం ఊహించని ఒక విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Finn Allen : 33 బంతులు.. 10 ఫోర్లు.. 8 సిక్సర్లు..కేవలం 4 డాట్ బాల్స్.. అలెన్ కొట్టిన కొట్టుడికి రికార్డులన్నీ బద్దలు
Finn Allen
Rakesh
|

Updated on: Mar 05, 2026 | 7:06 AM

Share

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకున్న వేళ క్రికెట్ ప్రపంచం ఊహించని ఒక విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో అలెన్ తన జట్టును దర్జాగా ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, ఎన్నో ఏళ్ల రికార్డులను తుడిచిపెట్టేశాడు.

ఫిన్ అలెన్ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందంటే.. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అలెన్ కేవలం బౌండరీలపైనే కాకుండా సింగిల్స్, డబుల్స్ తీయడంలోనూ చాలా చురుగ్గా వ్యవహరించాడు. తను ఆడిన 33 బంతుల్లో కేవలం 4 బంతులు మాత్రమే డాట్ బాల్స్ కావడం విశేషం. అలెన్ లాంటి హిట్టర్ ఇంత తక్కువ డాట్ బాల్స్ ఆడటం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ విషయంలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక అరుదైన రికార్డును మాత్రం అలెన్ అందుకోలేకపోయాడు.

గణాంకాల ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచుల్లో కనీసం 30 బంతులు ఆడిన బ్యాటర్లలో అత్యంత తక్కువ డాట్ బాల్స్ ఆడిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2014 సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా పైనే కోహ్లీ 44 బంతుల్లో 72 పరుగులు చేసినప్పుడు, కేవలం 3 డాట్ బాల్స్ మాత్రమే ఆడాడు. ఫిన్ అలెన్ 4 డాట్ బాల్స్ ఆడటంతో కేవలం ఒక్క బంతి తేడాతో విరాట్ రికార్డును సమం చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో అత్యంత ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ల జాబితాలో అలెన్ రెండో స్థానానికి చేరుకున్నాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. మార్చి 4న జరిగిన ఈ పోరులో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఊదేసింది. ఫిన్ అలెన్ సెంచరీకి తోడు మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (58) కూడా చెలరేగడంతో కివీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ రికార్డుల సెంచరీతో ఫిన్ అలెన్ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే, ఆమె తల్లి చెప్పిన టిప్
ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే, ఆమె తల్లి చెప్పిన టిప్
రైతులకు అలర్ట్‌.. PM కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?
రైతులకు అలర్ట్‌.. PM కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?
భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..?
భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..?
మహేష్ బాబు వదులుకున్న కథతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్
మహేష్ బాబు వదులుకున్న కథతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్
కుజుడితో వారు జాగ్రత్త..ఆ రాశులకు ఆర్థిక వివాదాలకు ఛాన్స్..!
కుజుడితో వారు జాగ్రత్త..ఆ రాశులకు ఆర్థిక వివాదాలకు ఛాన్స్..!
శ్రావణమాసలంలో పెరుగన్నం తింటే ప్రమాదమేనా?..
శ్రావణమాసలంలో పెరుగన్నం తింటే ప్రమాదమేనా?..
దంచి కొట్టే వానల్లో కారం కారంగా కాలీఫ్లవర్ 65..ఇలా చేస్తే అదుర్స్
దంచి కొట్టే వానల్లో కారం కారంగా కాలీఫ్లవర్ 65..ఇలా చేస్తే అదుర్స్
జర్నీలో పగిలిన రూ.35 వేల మద్యం బాటిల్.. వినియోగదారుల కమిషన్ షాక్
జర్నీలో పగిలిన రూ.35 వేల మద్యం బాటిల్.. వినియోగదారుల కమిషన్ షాక్
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కాండల్స్
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కాండల్స్
ట్రంప్ కుటుంబమే టార్గెట్! అమెరికాలో టెన్షన్..!
ట్రంప్ కుటుంబమే టార్గెట్! అమెరికాలో టెన్షన్..!