నేను 2025 జులై నుంచి టీవీ9 తెలుగు డిజిటల్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. స్పోర్ట్స్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, ఒలింపిక్స్ లాంటి క్రీడలకు సంబంధించిన వార్తను రాయడంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. వాటితో పాటు ఆటోమొబైల్స్, బిజినెస్, టెక్నాలజీ, సినిమా, వైరల్, హెల్త్‌కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాస్తాను. వెలుగు, సమయం లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో చేసిన అనుభవం ఉంది.
IND vs PAK Final: ఇండియా-పాక్ ఫైనల్‌కు ఫుల్ హైప్.. నఖ్వీ విషయంలో మాత్రం సస్పెన్స్
IND vs PAK Final: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ కీలక ఫైనల్‌కు ముందు పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హాజరు విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో భారత్-పాకిస్థాన్ క్రికెట్‌కు సంబంధించిన ప్రోటోకాల్ వివాదాల నేపథ్యంలో తాజా పరిణామంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 6:15 pm
IND vs WI: చివరి వన్డేలో టీమిండియా కీలక మార్పులు.. బెంచ్‌పై ఉన్న ప్లేయర్లకు ఛాన్స్
IND vs WI: భారత్ ఇప్పటికే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్ ఫలితం ఖరారైన నేపథ్యంలో బెంచ్‌కు పరిమితమైన రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 5:40 pm
ODI World Cup 2027: వరల్డ్‌కప్ 2027లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’ కలవరం.. బంగ్లాదేశ్ జట్టు పరిస్థితి అగమ్యగోచరం
ODI World Cup 2027: 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ప్రకటించిన గ్రూప్‌లలో గ్రూప్ బి అత్యంత ప్రమాదకరమైనదిగా నిలిచింది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లు ఉండటంతో బంగ్లాదేశ్ జట్టు సూపర్-7 దశకు చేరడం కష్టంగా మారింది.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 4:55 pm
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ కీలక నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు చాహల్ గుడ్ బై
Yuzvendra Chahal: భారత ప్రముఖ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశం తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడాలన్న కల నెరవేరకుండానే ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన భావోద్వేగ లేఖను పంచుకున్నాడు.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 4:14 pm
Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: భారతీయ 15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిష్టాత్మక టైమ్ 100 నెక్స్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ గ్లోబల్ లిస్ట్‌లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ అథ్లెట్‌గా, ఏకైక క్రికెటర్‌గా వైభవ్ అరుదైన ఘనత సాధించాడు.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 3:56 pm
ODI World Cup 2027: గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే?
ODI World Cup 2027: 2027 వన్డే ప్రపంచకప్‌లో ఐసీసీ కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టింది. గ్రూప్ దశ తర్వాత సూపర్-7 రౌండ్‌లో జట్లు పోటీ పడనున్నాయి. ఈ మార్పుతో భారత్, పాకిస్థాన్ జట్లు టోర్నీలో రెండుసార్లు తలపడే అవకాశం ఉంది. సూపర్-7 నిబంధనలు, జట్ల అర్హత ప్రక్రియ, సెమీఫైనల్‌కు చేరే విధానం గురించి తెలుసుకుందాం.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 2:56 pm
Asian Games 2026: భారత్ – పాకిస్థాన్ మెగా ఫైనల్.. రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ సహా ఐదుగురు ఆటగాళ్లకు మరోసారి గోల్డ్ మెడల్ సాధించే సువర్ణావకాశం లభించింది.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 2:44 pm
IND VS SA: 2027 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. సౌతాఫ్రికాలో 6 వన్డేల సిరీస్
IND vs SA: 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా సన్నద్ధతపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. సౌతాఫ్రికా గడ్డపై ఆరు వన్డేల సిరీస్ ఆడేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ వేదికలపై ముందస్తు అనుభవం, పేస్ పిచ్‌లపై ప్రాక్టీస్, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడమే ఈ టూర్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 1:05 pm
Shubman Gill: శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన యంగ్ సెన్సేషన్
Shubman Gill: వెస్టిండీస్‌పై అజేయ డబుల్ సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ రికార్డులతో పాటు గిల్ సాధించిన పది రికార్డుల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 12:34 pm
ODI World Cup: మళ్లీ అదే గ్రూప్‌లో ఇండియా-ఆస్ట్రేలియా.. ఫైనల్ పగ తీర్చుకునే టైమ్ వచ్చేసింది
ODI World Cup: ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో 14 జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఎ లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 10న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 11:40 am
Shubman Gill: డబుల్ సెంచరీని పక్కనపెట్టండి.. గిల్‌లో గంభీర్ చూసింది ఇదే
Shubman Gill: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించినప్పటికీ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం గిల్ కెప్టెన్సీ తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. గిల్ మైదానంలో బౌలర్లను అర్థం చేసుకునే తీరు, వారిపై నూతనోత్సాహం నింపుతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని గంభీర్ పేర్కొన్నారు.
- Rakesh
- Updated on: Oct 2, 2026
- 11:18 am
ICC World Cup 2027: ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ICC World Cup 2027: ఐసీసీ 2027 వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్‌ను నేడు కేప్ టౌన్‌లో విడుదల చేసింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది ముందు ఈ ప్రకటన వెలువడింది. భారత క్రికెట్ అభిమానులు ఎదురు చూసే భారత్ పాక్ మ్యాచ్ అక్టోబర్ 10న జరగనుంది.
- Rakesh
- Updated on: Oct 1, 2026
- 9:46 pm