AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan : త్వరలోనే ఒకటవ్వబోతున్న ఇషాన్ కిషన్ – అదితి..పెళ్లి డేట్ లీక్ చేసిన తాతయ్య

Ishan Kishan : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు.

Ishan Kishan : త్వరలోనే ఒకటవ్వబోతున్న ఇషాన్ కిషన్ - అదితి..పెళ్లి డేట్ లీక్ చేసిన తాతయ్య
Ishan Kishan Aditi Hundia
Rakesh
|

Updated on: Mar 10, 2026 | 2:37 PM

Share

Ishan Kishan : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈసారి అతను చర్చల్లో నిలిచింది తన బ్యాటింగ్ వల్ల కాదు.. తన పర్సనల్ లైఫ్, పెళ్లి కబురు వల్ల. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన కిషన్, మ్యాచ్ ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంలో తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియాను ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇషాన్ కిషన్ పెళ్లిపై అతని తాతయ్య రామానుగ్రహ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నీ పెళ్లి చూసే వరకు నేను బతుకుతానా నాయనా?” అని ఇషాన్‌ను అడిగినట్లు తెలిపారు. దానికి ఇషాన్ నవ్వుతూ.. “తాతయ్య, నా పెళ్లి వచ్చే ఏడాది(2027)లోనే జరుగుతుంది. మీరు నా పెళ్లి చూడటమే కాదు, నాకు పుట్టబోయే బిడ్డను కూడా మీ ఒడిలో వేసుకుని ఆడించాలి.. అంతవరకు మీరు క్షేమంగా ఉండాలి” అని బదులిచ్చాడట. ఇషాన్‌కు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయడానికి తమ కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎవరీ అదితి హుండియా?

ఇషాన్ కిషన్ మనసు దోచుకున్న అందాల సుందరి అదితి హుండియా మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మిస్ దివా 2018 విజేతగా నిలవడమే కాకుండా, ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా కూడా నిలిచారు. జైపూర్‌కు చెందిన ప్రముఖ నెయ్యి వ్యాపారి కుమార్తె అయిన అదితి, 2019 ఐపీఎల్ సీజన్ నుంచి ఇషాన్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో స్టేడియంలో ఆమెను చూసిన నెటిజన్లు మిస్టరీ గర్ల్ అని పిలిచేవారు. అప్పటి నుంచి ఇషాన్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఆమె హాజరవుతూ అతన్ని ప్రోత్సహిస్తోంది. ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు కూడా టీమిండియా సభ్యులతో కలిసి అదితి డిన్నర్‌లో పాల్గొనడం విశేషం.

పెళ్లి ఎప్పుడు?

ఇషాన్ కిషన్ మాటల ప్రకారం చూస్తే 2027లో ఈ జంట ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే కనిపిస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న ఇషాన్, త్వరలోనే తన పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోపు అదితి సోషల్ మీడియా వేదికగా ఇషాన్‌కు అభినందనలు తెలుపుతూ షేర్ చేసిన పోస్ట్‌లు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు