AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

James Neesham : వరల్డ్ కప్ ఫైనల్ హీరోకు తప్పని తిప్పలు.. తన జీతం కోసం సోషల్ మీడియాలో పోరాటం

James Neesham : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయినా, ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ (James Neesham) తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చినప్పటికీ, 3 కీలక వికెట్లు తీసి టీమిండియాను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

James Neesham : వరల్డ్ కప్ ఫైనల్ హీరోకు తప్పని తిప్పలు.. తన జీతం కోసం సోషల్ మీడియాలో పోరాటం
James Neesham
Rakesh
|

Updated on: Mar 10, 2026 | 6:24 PM

Share

James Neesham : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయినా, ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ (James Neesham) తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చినప్పటికీ, 3 కీలక వికెట్లు తీసి టీమిండియాను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం నీషమ్ తన ఆట కంటే కూడా సోషల్ మీడియాలో చేసిన ఒక ఘాటు కామెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. తనకి రావాల్సిన జీతం ఇవ్వలేదంటూ ఒక క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను బహిరంగంగా నిలదీశాడు నీషమ్.

అసలేం జరిగింది?

నేపాల్ ప్రీమియర్ లీగ్(NPL)లోని పోఖారా ఎవెంజర్స్ అనే జట్టుకు జేమ్స్ నీషమ్ గత ఏడాది ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీనిని అభినందిస్తూ పోఖారా ఎవెంజర్స్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. “మా ఆటగాడు నీషమ్ అద్భుతం” అంటూ పొగిడేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నీషమ్‌కు కోపం వచ్చింది. వెంటనే ఆ పోస్ట్ కింద.. “సరే బానే ఉంది.. ఇప్పుడు ఆటగాళ్ల బకాయిలు చెల్లించండి” అంటూ రిప్లై ఇచ్చాడు.

సోషల్ మీడియాలో రచ్చ

నీషమ్ చేసిన ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఒక అంతర్జాతీయ స్టార్ ఆటగాడికి కూడా సరైన సమయానికి డబ్బులు ఇవ్వలేదంటే ఆ లీగ్ పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గత సీజన్‌లో నీషమ్ పోఖారా ఎవెంజర్స్ తరపున 4 మ్యాచ్‌లాడి 99 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినా, నీషమ్ తన వంతు కృషి చేశాడు. కానీ ఆడినందుకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని మాత్రం మేనేజ్‌మెంట్ ఎగ్గొట్టినట్లు ఈ కామెంట్‌తో స్పష్టమైంది.

ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

నీషమ్ సాధారణంగానే సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. తనదైన శైలిలో సెటైర్లు వేయడంలో అతను దిట్ట. అయితే ఈసారి నేరుగా డబ్బుల గురించి అడగడంతో ఫ్యాన్స్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. “ఆటగాళ్ల కష్టార్జితాన్ని ఇవ్వకుండా సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకోవడం ఏంటి?” అంటూ పోఖారా ఎవెంజర్స్ టీమ్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి చిన్న లీగ్‌లలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ఆ లీగ్ ప్రతిష్ట దెబ్బతింటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?
అనాథలా మానసిక దివ్యాంగురాలు.. అల్లు అర్జున్ ఏ చేశాడంటే? వీడియో
అనాథలా మానసిక దివ్యాంగురాలు.. అల్లు అర్జున్ ఏ చేశాడంటే? వీడియో
మేం పడుకున్నాం.. ఏం జరిగిందో తెలియదు.. అంటూ ఫోన్ చేశాడు.. చివరకు
మేం పడుకున్నాం.. ఏం జరిగిందో తెలియదు.. అంటూ ఫోన్ చేశాడు.. చివరకు