AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : స్టేడియంలో ధోనీ, రోహిత్ సందడి.. కానీ కింగ్ కోహ్లీ ఎక్కడ? గైర్హాజరుకు అసలు కారణం ఇదే

Virat Kohli : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనుల పండుగలా సాగింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవడమే కాకుండా, స్టేడియంలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు మెరవడం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.

Virat Kohli : స్టేడియంలో ధోనీ, రోహిత్ సందడి.. కానీ కింగ్ కోహ్లీ ఎక్కడ? గైర్హాజరుకు అసలు కారణం ఇదే
Virat Kohli
Rakesh
|

Updated on: Mar 10, 2026 | 8:01 PM

Share

Virat Kohli : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనుల పండుగలా సాగింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవడమే కాకుండా, స్టేడియంలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు మెరవడం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. అయితే ఈ అపురూప వేడుకలో విరాట్ కోహ్లీ కనిపించకపోవడం అందరినీ కలచివేసింది. ధోనీ, రోహిత్ వచ్చారు కానీ.. విరాట్ ఎందుకు రాలేదు? అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ స్టేడియానికి రావడానికి ఒక బలమైన అధికారిక కారణం ఉంది. ఐసీసీ నిబంధనలు లేదా ప్రోటోకాల్ ప్రకారం.. గతంలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన మాజీ కెప్టెన్లను గౌరవసూచకంగా ఈ ఫైనల్‌కు ఆహ్వానించారు. ధోనీ 2007లో తొలి వరల్డ్ కప్ అందించగా, రోహిత్ శర్మ 2024లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపారు. వీరిద్దరూ విన్నర్స్ కాబట్టి అధికారికంగా ట్రోఫీ ప్రదర్శనలో పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన కెప్టెన్ అయినప్పటికీ, అతని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. అందుకే అధికారిక బాధ్యత ఏదీ లేకపోవడంతో ఆయన రాలేదు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని కోరుకుంటున్నారు. అంతర్జాతీయ టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడుతూ.. “నేను క్రికెట్ నుంచి తప్పుకున్నాక కొన్ని రోజులు ఎవరికీ కనిపించను. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ కావాలి” అని చెప్పారు. అదే పంథాలో, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే మ్యాచ్ చూస్తూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారిన తర్వాత విరాట్ కోహ్లీకి ప్రశాంతంగా కూర్చుని మ్యాచ్ చూసే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఒక సాదాసీదా అభిమానిలా ఇంటి నుండే టీమిండియా గెలుపును ఆస్వాదించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ధోనీ, రోహిత్ స్టేడియంలో సందడి చేస్తున్నా.. కోహ్లీ మాత్రం తనదైన శైలిలో నిశ్శబ్దంగా దేశ విజయాన్ని ఆస్వాదించారు. ఏది ఏమైనా, మైదానంలో కోహ్లీ ఎనర్జీని మిస్ అయ్యామని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..