మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో కలిసి నటించే అవకాశాలపై వరుణ్ తేజ్ స్పందించారు. అటువంటి కాంబినేషన్ కోసం తాను 100% సిద్ధంగా ఉన్నానని, అది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు. సరైన సమయం, సందర్భం వస్తే అది తప్పకుండా జరుగుతుందని వరుణ్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.