AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

తెలుగు హీరోయిన్ తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలపై ఉన్న ఆలోచనలను, అనుభవాలను పంచుకున్నారు. ఒకప్పుడు ప్రాధాన్యత కోసం గ్లామర్ రోల్స్ చేయాలనుకున్నానని, అయితే స్విమ్‌సూట్‌లో నటించినప్పుడు అసౌకర్యానికి గురయ్యానని తెలిపారు. చివరకు, కథ, పాత్రకు ప్రాధాన్యతనిస్తూ గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవడంపై ఆమె దృష్టి సారించారు.

Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
Meena
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2026 | 2:12 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో గ్లామర్ పాత్రలు, కెరీర్ ఎంపికలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. సినీ రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని ఎలా పొందాలనే దానిపై ఆమె స్పష్టమైన ఆలోచన గురించి వివరించారు. మీనా తన కెరీర్ తొలినాళ్లలో, గ్లామర్ పాత్రలు చేసే నటీమణులకు లభించే ప్రాధాన్యతను, అటెన్షన్‌ను చూసి, తానూ అలాంటి పాత్రలు చేయాలా అని ఆలోచించానని ఒప్పుకున్నారు. తాను కూడా ఒక హీరోయిన్నే కదా, వారికంటే సీనియర్‌ని అయినా తనకు ఎందుకు అంత ప్రాధాన్యత లభించడం లేదని ప్రశ్నించుకునేదాన్నని తెలిపారు. అప్పట్లో తన తల్లితో ఈ విషయమై ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని మీనా భావోద్వేగంగా వెల్లడించారు. అయితే, ఈ ఆలోచనల నుండి ఆమె తన కెరీర్ ఎంపికల వైపు దృష్టి మళ్లించారు. “నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను?” అనే ప్రశ్నలు తన ప్రతి సినిమా ఎంపికలోనూ ముఖ్యమయ్యాయని మీనా పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వస్తున్నప్పుడు తన పాత్రను గుర్తుపెట్టుకోవాలని తను ఎప్పుడూ కోరుకునేదాన్నని అన్నారు.

గ్లామర్ రోల్స్‌పై ఉన్న ఆసక్తితో ఒకసారి తమిళ చిత్రంలో స్విమ్‌సూట్‌లో నటించే అవకాశం వచ్చిందని మీనా తెలిపారు. దర్శకుడు ప్రభుదేవా సినిమా అది. ఆ పాత్ర చేయడానికి అంగీకరించినప్పటికీ, స్విమ్‌సూట్ వేసుకున్న తర్వాత తనకు తీవ్ర అసౌకర్యం కలిగిందని ఆమె గుర్తు చేసుకున్నారు. మేకప్ రూమ్ నుండి బయటకు రావడానికి కూడా తాను చాలా ఇబ్బంది పడ్డానని, డ్యాన్స్ చేయడం, పర్ఫామ్ చేయడం తనవల్ల కాలేదని మీనా అన్నారు. “అయ్యో, ఈ హీరోయిన్స్ అందరి కాళ్ళు మొక్కుకోవాలిబా, ఇది ఎలా చేస్తున్నారు?” అని తను నిజంగా ఆశ్చర్యపోయానని ఆమె నవ్వుతూ చెప్పారు. కమిట్‌మెంట్ ఇవ్వడంతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినప్పటికీ, ఆ అనుభవం తర్వాత అది “నా కప్ ఆఫ్ టీ కాదు” అని వదిలేశానని స్పష్టం చేశారు. ఈ సంఘటన తర్వాత, ప్రేక్షకుల నుండి “మీనా కూడా ఎందుకండి ఇలా చేశారు?” అనే ప్రతిస్పందన వచ్చిందని, అప్పుడే తన అసలైన బలం ఎక్కడ ఉందో తనకు అర్థమైందని తెలిపారు.

తన కెరీర్‌లో రోజా వంటి నటీమణులతో ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని మీనా గుర్తు చేసుకున్నారు. “టగ్ ఆఫ్ వార్” లాగా ఒకరు చేయలేని సినిమాను మరొకరు చేసేవారని, కవర్ పేజీలపై కూడా తమ ఇద్దరి చిత్రాలు కలిసి వచ్చేవని ఆమె తెలిపారు. సౌందర్య, రంభ, రమ్యకృష్ణ, నగ్మా వంటి తన సమకాలీన నటీమణులతో పోటీ ఉన్నప్పటికీ, పని పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా వారందరితోనూ మంచి స్నేహం కొనసాగిందని మీనా అన్నారు. “వర్క్ చేసేటప్పుడు నేను బెస్ట్ గా ఉండాలి అనుకుంటాను, కానీ ప్యాకప్ అవ్వగానే అంతా నార్మల్,” అని ఆమె వివరించారు. 90ల గ్రూప్‌లో సభ్యురాలిగా ఇప్పటికీ అందరూ కలిసి పండుగలను, వేడుకలను జరుపుకుంటారని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

మీనా పోస్ట్..

Meena Movies

Meena Movies

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us