AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఇంత పొడవు ఉంది.. ఎంత ప్రమాదకారో అనుకునేరు.. నిజానికి మనకు మంచి చేసే పాము..

తిరుమల కొండపై పాముల సంచారం భక్తులు, టీటీడీ సిబ్బందిని కలవరపెడుతోంది. తాజాగా స్పెషల్ టైప్ క్వార్టర్స్ వద్ద ఏడడుగులకు పైగా పొడవున్న జర్రిపోతు కనిపించింది. అప్రమత్తమైన టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది పాములు పట్టే ఉద్యోగి భాస్కర్ నాయుడి సాయంతో దానిని సురక్షితంగా పట్టుకుని శేషాచలం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Tirumala: ఇంత పొడవు ఉంది.. ఎంత ప్రమాదకారో అనుకునేరు.. నిజానికి మనకు మంచి చేసే పాము..
Rat Snake
Raju M P R
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 11:36 AM

Share

తిరుమల కొండపై పాముల సంచారం భక్తులను కలవరపెడుతోంది. తరచూ జనావాసాల్లోకి వస్తున్న విషసర్పాలు అటు భక్తులతో పాటు ఇటు టీటీడీ సిబ్బందినీ భయపెడుతున్నాయి. తాజాగా స్పెషల్ టైప్ క్వార్టర్స్ వద్ద ఏకంగా ఏడడుగులకు పైగా పొడవున్న జర్రిపోతు కనిపించడం కలకలం రేపింది.

టీటీడీ సిబ్బంది, భక్తులు సంచరించే ప్రాంతంలోనే ఈ భారీ పాము కనిపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే టీటీడీ ఫారెస్ట్ విభాగానికి సమాచారం అందించారు. దీంతో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఏడడుగులకు పైగా ఉన్న జర్రిపోతును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని ఓ బ్యాగులో బంధించి, తన బైక్‌పై శేషాచలం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. దీంతో భక్తులు, టీటీడీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అసలు జర్రిపోతు పాము ఎలా ఉంటుంది?

జర్రిపోతును ఇంగ్లిష్‌లో ఇండియన్ ర్యాట్ స్నేక్అంటారు. ఇది విషపూరితం కాని పాము. అయితే భారీ శరీరం, వేగంగా కదిలే స్వభావం, బుసలు కొట్టే శబ్దంతో చూడగానే భయపెడుతుంది. చ సాధారణంగా 6 నుంచి 8 అడుగుల వరకు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ పొడవు కూడా ఉంటుంది. గోధుమ, ఆలివ్, పసుపు-గోధుమ రంగుల్లో కనిపిస్తుంది. శరీరంపై నల్లటి గుర్తులు ఉండొచ్చు. ఎలుకలు, కప్పలు, బల్లులు, పక్షులు, గుడ్లను తింటుంది. చిన్న పాములను కూడా వేటాడుతుంది.

ప్రమాదం ఎదురైనప్పుడు వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. బెదిరింపుగా అనిపిస్తే పడగ ఎత్తకుండా శరీరాన్ని పైకి లేపి బుసలు కొడుతుంది. జర్రిపోతు విషపూరితం కాకపోయినా దానిని చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. కాటేస్తే గాయమయ్యే ప్రమాదం ఉంది. అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వడం ఉత్తమం. పొలాల్లో ఎలుకలను తింటూ జీవ వైవిధ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరోవైపు.. శేషాచలం అడవుల నుంచి జనావాసాల్లోకి వస్తున్న పాముల సంఖ్య ఇటీవల పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా భక్తులు బస చేసే వసతి గదుల సమీపంలోనే పాములు కనిపిస్తుండటంతో తిరుమలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Follow Us